బాల్య వివాహాలు...కుటుంబ నియంత్రణ పై

అవగాహన సదస్సు


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం నాగేళ్ల ముడుపు గ్రామంలో 104 సిబ్బంది, గ్రామ సర్పంచ్ టీ. అంజయ్య ఆధ్వర్యంలో బాల్య వివాహాల చట్టం, కుటుంబ నియంత్రణ, కాలానుగుణంగా  వ్యాధులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తర్లుపాడు మండలం పి హెచ్ సి డాక్టర్ కె వంశీకృష్ణ మాట్లాడుతూ మహిళలు అతి చిన్న వయసులో వివాహం చేసుకోవడం వలన వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. అనంతరం  డాక్టర్ టీ చైతన్య సుధా మాట్లాడుతూ చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల స్త్రీలు గర్భ సంబంధిత వ్యాధులకు గురవుతారని తెలియజేస్తూ

బాలింతలు తీసుకోవలసిన తగు సూచనలు సలహాలు అందిస్తూ ఆరోగ్య జాగ్రత్తలు మరియు పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 104 సిబ్బంది వారు డాక్టర్ ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాలానుగుణంగా వ్యాధులైన టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు  గ్రామస్తులకు వివరించి 104,108 వాహనాల యొక్క విశిష్టతను మరియు సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు 104 డి ఈ ఓ జె వై.విజయ్ కుమార్, ఎస్.వెంకటేశ్వర్లు 108 సిబ్బంది ఈ ఎం  టీ.తిరుపతిరెడ్డి, రామయ్య ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య మరియు సచివాలయ సిబ్బంది గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: