ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం
లబ్దిదారులు రేషన్ డీలర్ షాపుల వద్దకు వెళ్లాల్సిందే
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
ఏపీలో నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) క్రింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ రాష్ట్రంలో మంగళవారం(జూలై 20,2021) నుంచి ప్రారంభించారు. ఈ పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల ద్వారా చేపట్టాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలిచ్చింది.
ఇప్పటికే రెగ్యులర్ పీడీఎస్ కింద రేషన్ సరుకులు పంపిణీ చేయగా, కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని ఇప్పుడు పంపిణీ చేయబోతున్నారు. ఈసారి ఉచితంగా ఇచ్చే బియ్యం పీఎంజీకేఏవై కింద కేంద్రం ఇస్తుందన్న విషయాన్ని రేషన్ షాపుల్లో ప్రత్యేకంగా పోస్టర్లు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఉచితంగా ఇస్తున్నారనేది పేదలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ మేరకు పోస్టర్లు కట్టాలని కేంద్రమే రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. అయితే కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యం మొత్తం 1.47 కోట్ల కార్డుల్లో.. 88 లక్షల కార్డులకే వస్తాయని, మిగిలిన 59 లక్షల కార్డులకిచ్చే బియ్యం భారం మొత్తాన్ని తామే భరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: