తండ్రి బాటలో తనయుడు
దివంగత నేత ఆరుగులువేస్తే...జగన్ పది అడుగులేస్తున్నారు
ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశంజిల్లా మార్కాపురంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములోని గడియార స్తంభం వద్ద వైఎస్సార్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, పార్టీ రాష్ట్ర సెక్రటరి ఎమ్. షంషీర్ అలీబేగ్, మున్సిపల్ చైర్మన్ బాలమురళి కృష్ణ ,వైస్ చైర్మన్ ఇస్మాయిల్, పలువురు కౌన్సిలర్లు ,వైకాపా నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.ఎ. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు మరువలేనివని గుర్తు చేశారు . ఈరోజు అదే బాటలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ప్రజల సంక్షేమం విషయంలో ఆరు అడుగులు ముందుకు వేస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది అడుగులు ముందుకువేసి నవరత్నాలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనారిటి వైసిపి నాయకులు, వార్డ్ నెంబర్లు పట్టణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వై.ఎస్.కు ఘన నివాళ్లి
ప్రకాశంజిల్లా మార్కాపురం లో దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ,వైయస్సార్ జయంతి సందర్భంగా మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మార్కాపురం క్రాస్ రోడ్లోని వైయస్సార్ విగ్రహానికి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.
వై.ఎస్.జయంతిసందర్భంగా,,,అన్నధాన కార్యక్రమం...
ప్రకాశంజిల్లా మార్కాపురంలో దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి వైసీపీ నేతలు ఘన నివాళ్లులర్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తూర్పు బజార్లో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుంటక క్రిష్ణ వేణి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె నాగార్జున రెడ్డి, ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ సెక్రటరీ యమ్ షంషీర్ అలీభేగ్, పార్టీ నాయకులు గుంటక వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: