నా కుమారుడి హత్యకు కారకులైన వారికి శిక్ష పడేలా చూడండి
- ప్రజా సంఘాలను కోరిన బాధిత తల్లిదండ్రులు
-తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని అఖిలపక్ష సమావేశంలో భరోసా ఇచ్చిన ప్రజాసంఘాలు
ముసలి వాళ్ళ మైన మాకు అండగా నిలవాల్సిన కుమారుడు మలుగూరు చెరువులో శవమై తేలడంతో వారి ఆశలు నీటి బుగ్గల ఆవిరగడం, వారికి ఇటు మానసికంగాను ఆటు కుమారుడు హత్య కాబడ్డాడు అన్న సమయంలో ఉన్న తల్లిదండ్రులకు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు అండగా నిలిచాయి. గత మూడు నెలల క్రితం హిందూపురం మండలం కొట్నూరు సమీపంలో ఉన్న శ్రీ మంజునాథ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న నరసింహ మూర్తి హత్యకు గురవడం పై పలుమార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన తన కుమారుడి హత్యకు గురైన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలం అవ్వడంతో తల్లిదండ్రులు ప్రజా సంఘాల నాయకులను కలిశారు. దీంతో బుధవారం హిందూపురం లోని ఆల్ హిలాల్ ఆవరణంలో దళిత నరసింహమూర్తి హత్యకు కారకులైన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్బ్యూరో సభ్యులు బండారి పోతులయ్య ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మలుగూరు చెరువులో శవమై తేలిన దళిత నరసింహమూర్తి మృతిపై విచారణ జరిపించాలి.
మృతికి కారణమైన వారిని తక్షణం గుర్తించి అరెస్టు చేయాలి.
మృతుని కుటుంబానికి చట్టప్రకారం రావలసిన 20 లక్షల రూపాయల నష్టపరిహారం , ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం , పెన్షన్ తక్షణం ప్రభుత్వం అమలు చేయాలి అని కెవిపీఎస్, దళిత హక్కుల పరిరక్షణ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు హిందూపురంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బండారు పోతులయ్య ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న , కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య , ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఉపాధ్యక్షులు వెంకటేశులు , తూముకుంట పారిశ్రామికవాడ కార్మిక నాయకులు రవి, యునైటెడ్ ఫోరం ఆఫ్ , ఎంఆర్పీఎస్ హిందూపురం నాయకులు సతీష్ , సిఐటియు నాయకులు నరసింహులు , మృతుని తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మలుగూరు దళిత నరసింహమూర్తి మే నెల 8వ తేదీన మలుగూరు చెరువులో శవమై తేలింది. గ్రామస్తులు ఎవరు మృతదేహాన్ని గుర్తించలేని పరిస్థితి కారణంగా ఎవరు అనేది నిర్ధారణ కాలేదు. అదే సమయంలో మృతుని తల్లిదండ్రులు కరోనా బారినపడి ఆస్పత్రిలో ఉన్నారు. తల్లిదండ్రులు స్ధానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కింద కేసు పెట్టినారు. మృతి చెందిన దళిత నరసింహమూర్తి ఆనవాళ్లు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో గుర్తించారు. అప్పటినుండి నేటి సుమారు మూడు నెలల అవుతున్నా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేదు. Citu , వ్యవసాయ కార్మిక సంఘం మరియు kvps సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేసిన ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అందువలన ఈ సదస్సు సందర్భంగా అన్ని దళిత ప్రజాసంఘాల నాయకులు ఈ క్రింది డిమాండ్స్ చేయడం జరిగింది.
దళిత నరసింహమూర్తి మృతి హంతకులను గుర్తించి అరెస్టు చేయాలి. మృతిని తల్లిదండ్రులు అనుమానించే వారిని విచారించి కేసు పెట్టాలి. మృతుని కుటుంబానికి చట్టం ప్రకారం 20 లక్షల రూపాయల నష్టపరిహారం , ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి , ఇంటిలో ఒకరికి ఉద్యోగం , పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జులై 8 , 9 తేదీలలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని అదేవిధంగా 12వ తేదీన మలుగూరు చెరువు నుండి ఎమ్మార్వో కార్యాలయం హిందూపురం వరకు పాదయాత్ర చేయాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: