శిరీషా నిందితుడిని కఠినంగా శిక్షించండి
హరిప్రసాద్ బహుజన్ డిమాండ్
పులివెందుల సీఎం కార్యాలయంలో ఘటన వివరాలను అందించిన నేతలు
(జానోజాగో వెబ్ న్యూస్-పులివెందుల ప్రతినిధి)
శిరీషా ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మంగలి మహసభ జాతీయసంఘం, బీసీ మహజనసమితి ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ బహుజన్ డిమాండ్ చేశారు. అన్యాయానికి గురైన ఆ ఆడబిడ్డకు న్యాయం చేయాలని, వారి కుటుంభాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారంనాడు పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శిరీషా హత్య ఘటన వివరాలను అక్కడి అధికార్ల పిలుపుమేరకు వెళ్లి మంగలి మహసభ జాతీయసంఘం,బీసీ మహజనసమితి ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ బహుజన్, బద్వేలు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మయ్య అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంభానికి న్యాయం చేయాలని, బాధిత కుటుంభాన్ని ఆదుకొంటానన్న ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: