తుమ్మల చెరువులో...
రైతులకు శిక్షణ కార్యక్రమం
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం లోని తుమ్మలచెరువు రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో తుమ్మలచెరువు, జగన్నాధపురం గ్రామ సర్పంచులు అయినటువంటి షేక్ షాజహాన్, గంట వెంకట్ రెడ్డి గారి అధ్యక్షతన "డాక్టర్ వైయస్ ఆర్ రైతు భరోసా - చైతన్య యాత్ర" ద్వారా రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి ఆర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్ సీజన్లో మార్కెట్ ఆధారిత వరి వంగడాలను మాత్రమే నీరు పుష్కలంగా ఉండి ఉన్న ప్రదేశం వారు మాత్రమే సాగు చేయాలని సూచించారు. మెట్ట ప్రాంతాలు, బోరు వసతితో వరి పండించే రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు ( డ్రిప్పు తో ) సాగు చేసుకోవడం వలన నీటిని ఆదా చేయవచ్చని తెలిపారు. ప్రతి రైతు విత్తనం కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలని అలాగే రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేశారు.
ప్రతి ఒక్క రైతు పంట వేసే ముందు విత్తనాన్ని విత్తన శుద్ధి చేయాలని తద్వారా విత్తనం ద్వారా సంక్రమించే శీలింద్రాలను అరికట్టవచ్చని సూచించారు. అలాగే వేసవి దుక్కుల ను చేసుకోవాలని తెలిపారు. రైతులందరికీ తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవ డానికి అనువుగా ఎరువులు వాడుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రస్తుతం అమలు చేసే కస్టమ్స్ హైరింగ్ డే సెంటర్ (CHC), పంట సాగు దారు హక్కు పత్రం (CCRC) మరియు ఈ క్రాప్ బుకింగ్ గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి ఎన్. తేజ మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ మరియ స్పీంకర్లు ఇరిగేషన్ మీద రాయితీలను వివరించారు.
Post A Comment:
0 comments: