డిజైన్ స్లేట్ కార్మికుల కూలీలు పెంచాలని..

సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మెలోకి వెళ్లిన కార్మికులు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

               పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు డిజైన్ స్లేట్ కార్మికుల కూలీలు పెంచాలని డిజైన్ స్లేట్ వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. కూలి రేట్లు పెంపు విషయంలో కార్మికశాఖ అధికారులు జోక్యం చేసుకోవాలని స్థానిక కార్యాలయం ఏఎల్ఓ  కార్యలయము ముందు డిజైన్ స్లేట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నా ముందు పారిశ్రామికవాడలో కార్మికులు ర్యాలీ ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు డి కే యం రఫీ, యూనియన్ ప్రధాన కార్యదర్శి పి రూబెన్ మాట్లాడుతూ కార్మికుల కూలీలు ఒప్పందం ముగిసిన యజమానులు కూలీ రేట్లు పెంచడంలో నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని, ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రస్తుతం ఇస్తున్న కూలీలు ఏ మాత్రం సరిపోవడం లేదని కనీస వేతన చట్టం ప్రకారం కూలీలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చల పేరుతో కాలయాపన మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. కూలీలు పెంచే వరకు మా పోరాటం ఆగదని యాజమానులు  కూలీలు వెంటనే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బాల శేషయ్య వెంకటేశ్వర్ రెడ్డి టి. రాములు, ఏనుగుల సురేష్ కుమార్, ప్రకాశం, కాశయ్య, ఏలిషా వెంకట్రావు, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: