సచివాలయానికి వచ్చే సర్వీసులను...

ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలి 

నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్

ఆకస్మికంగా గ్రామ సచివాలయంను తనిఖీ 


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఉచిత రేషన్  సక్రమంగా పంపిణీ గావించాలని నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్  చౌక ధరల దుకాణం డీలర్లను ఆదేశించారు. శనివారం గడివేముల మండలం లోని చిందుకురు గ్రామంలో గల చౌక ధరల దుకాణంను నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ ఆకస్మికంగా తనికిచేయడం జరిగిందన్నారు. అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రజల కు దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలనిఅన్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రుల జాబితాను పరిశీలించి ఎవరైనా రోగులు సచివాలయానికి వస్తే వారికి ఎక్కడ రెఫర్ చేస్తున్నారు... ఎవరితో మాట్లాడుతున్నారు... ఇప్పటివరకు ఎంతమందికి రేఫర్ చేశారు... వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి రికార్డులను పరిశీలించారు.గ్రామపరధిలో ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు... 45 సంవత్సరాల పైబడిన వారికి ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు. ఫ్రెంట్ లైన్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు... ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు... ఇంకా రెండవ డోస్ ఎంతమంది వేయించుకోవాలి వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి రికార్డులను పరిశీలించారు.


వ్యాక్సినేషన్ ప్రక్రియ, అందరిని మోటివేషన్ చేసి 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఏ ఎన్ ఎంలకు ఆదేశించామనరు. నో మాస్క్- నో ఎంట్రీ బోర్డు పెద్ద బ్యానర్ ఏర్పాటు చేసి సచివాలయంకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని గ్రామాలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని  సచివాలయ సిబ్బందికి ఆదేశించామనరు. వైయస్సార్ బీమా, కాపు నేస్తం, నేతన నేస్తం పథకాలకు సంబంధించి సోషల్ ఆడిట్ కంప్లీట్ చేశారా వంటి వివరాలు అడిగి నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని వెల్ఫేర్ అసిస్టెంట్ కు ఆదేశించామన్నారు.

ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించిచారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సక్రమంగా విధులు నిర్వహించాలని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రిజిస్టర్ లను జాగ్రత్తగా మెయింటెన్ చేయాలని, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: