ఆత్మ పరిశుద్దత...చెడును త్యాజించడం

ఇదే ఈద్ సందేశం


ఈద్ యొక్క నిజమైన ఆధ్యాత్మిక ఆత్మ ఏమిటంటే మనిషి తన నైజం లోని  అపరిశుద్ధతను బలి చేయాలి ఈద్-ఉల్-ఫితర్ సందర్భంలో మనిషి నైజం ను పరిశుద్ధ పరచ డానికి  ఏ విధంగా శిక్షణ ఇవ్వబడిందో అదేవిధంగా     ఈదుల్ అద్ హా  సందర్భంలోనూ నైజంలోని మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసుకోవాలని డిమాండ్ చేయబడుతోంది. ముస్లిములు: జంతువులను, ఒంటెలను, మేకపోతులను, ఏ విధంగా కుర్బానీ ఇస్తున్నారో అదేవిధంగా తమలో ఉన్న చెడులను అంటే కోపం, అజ్ఞానం,పిరికితనం, ఏమరుపాటు, గర్వం  మోసం, అసహ్యత, కోరికలకు బానిస కావడం  వంటి వాటినన్నింటిని బలి చేయడం; అంటే వాటిని మానుకోవడం.అప్పుడే ఇబ్రహీం అలై జీవిత చరిత్రకు సార్థకత లభిస్తుంది. ముస్లిములు సత్య ధర్మ సందేశ హరులుగా మన గలుగుతారు.

అల్లామ ఇక్బాల్ ఇలా అంటున్నారు:

యే నీమ్ షబ్

ఈ మసక మసక రాత్రులలో 

యే  మురాఖబే

చేసే నీ దైవారాధనలు

యే సుజూద్ 

నీసాష్టాంగ పడడాలు

తేరీ ఖుదీకే

నిన్నే

నిగేహ్ బాన్ నహీతో

ప్రక్షాళనం చేయకపోతే

కుఛ్ భీ నహీ

అన్నీ వృధానే కదా

రండి ఈ పవిత్ర ఈద్ సందర్భంగా మనం వాగ్దానం చేద్దాం నిజంగా మనం సత్య ధర్మానికి, ముహమ్మద్ సల్లం గారి ధర్మానికి నిజమైన వారసులుగా నిలుద్దాం. నేను ఈ  సందర్భంగా  ఈద్ సందేశంతో పాటు ప్రపంచ ముస్లింలకు, ప్రత్యేకించి భారతీయ ముస్లింలకు మరియు దేశ వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

రచయిత -- డాక్టర్ ముహమ్మద్ ఖుతుబుద్దీన్

అమెరికన్ మనస్తత్వవేత్త, సోషల్ ఆక్టివిస్ట్

రచన అనువాదం-మొహమ్మద్ అబ్దుల్ రషీద్

హైదరాబాద్-సెల్ నెం-98485-16163

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: