వైసీపీకి, డిఎంకె కి మధ్య ఉన్న తేడాను తెలుసుకొని

బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకొందాం

ఆంధ్ర బహుజన ప్రజావేదిక

(జానోజాగో వెబ్ న్యూస్-పుట్టపర్తి ప్రతినిధి)

వైసీపీకి, డిఎంకె కి మధ్య ఉన్న తేడాను తెలుసుకొని బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకొందామని ఆంధ్ర బహుజన ప్రజావేదిక పిలుపునిచ్చింది. అనంతపురం జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమాడ మండల కేంద్రం నందు స్థానిక బహుజన నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్రెస్ మీట్" నందు రాష్ట్ర నాయకుడు కె.అర్ హరిప్రసాద్ బహుజన్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పాలన చేస్తున్న వైసీపీకి, తమిళనాడులో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డిఎంకె కి మధ్య ఉన్న తేడాలను సభ్యసమాజం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే తమిళనాడులో గౌరవ స్టాలిన్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన డిఎంకె  34 మందితో రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తే అందులో బీసీలకు-22, ముస్లింలకు-2, ఓసీలకు-6, ఎస్సీలకు-3, ఎస్టీలకు-1 చొప్పున చోటు కల్పించడం జరిగింది. ఇది దాదాపు ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఇది ఎట్లా సాధ్యమైందంటే డిఎంకె పార్టీ బహుజనులకు సంబంధించినది అయినందువలననే. ఆంధ్రప్రదేశ్ లో గౌరవ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి  నాయకత్వాన ఏర్పడిన వైసీపీ మంత్రివర్గంలో, గత టీడీపీ మంత్రివర్గం కంటే ఒకటో, రెండో ఎక్కువ మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులకు ఇచ్చి, 60శాతం మంత్రి పదవులు బహుజనులకు ఇచ్చినాం. మేము(వైసీపీ) ఇచ్చినంత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదని గ్లోబెల్ ప్రచారం తన సొంత మీడియా ద్వారా చేసుకోవడం జరిగింది. కాని పదవులు ఇచ్చిన మేరకు స్వతంత్రంగా ఆ పదవికి ఉన్న అధికారాన్ని కూడా వినియోగించుకొనివ్వకుండా రెడ్లు మొత్తం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం జరుగుతావుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజు, రాష్ట్రాన్ని మూడు సామంతు రాజ్యాలుగా ఏర్పాటు చేసి, ఈ మూడు సామంతు రాజ్యాలకు తమ రెడ్డి కులానికి చెందిన విజయసాయిరెడ్డి గార్ని, సజ్జల రామక్రిష్ణారెడ్డి గార్ని, వై.వి.సుబ్బారెడ్డి గారు లను సామంతు రాజులుగా నియమించుకొని మొత్తం అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేయడం జరుగుతావుంది. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపి, మంత్రి, తదితర పదవులకు ఉన్న అధికారాలన్నింటిని సామంతురాజులు లాక్కొని, వారు(సామంతురాజులు) ఇచ్చే డైరెక్షన్ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపి, మంత్రి, తదితర పదవులున్నవారు నడుచుకోవడం జరుగుతావుంది. ఇది పచ్చి నిజం. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చట్టం తెచ్చిన మేరకు అమలు చేయలేదు. కేవలం మార్కెట్ యార్డు కమిటీ, దేవాలయాల కమిటీల్లో కొంత మేరకు అమలు చేసినా, చట్టం తెచ్చిన మేరకు రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ కీలకమైన పదవులు, రాష్ట్ర సంపద, గౌరవం లభించే పదవుల్లో బహుజనులకు పూర్తిగా అమలు చేయలేదు.

రాష్ట్రంలో 4శాతం జనాభా ఉన్న రెడ్లకు దాదాపు 850 పైగా కీలకమైనవి, రాష్ట్ర సంపద, గౌరవం లభించే నామినేటెడ్ పదవులను ఇచ్చుకోవడంతోపాటు, విశ్వవిద్యాలయాల సెర్చ్ కమిటీల్లో రెడ్లే, వాళ్లను ఎంపిక చేసే వాళ్లు రెడ్లే, హైకోర్టులో జీపీలను, న్యాయవాదుల్ని నియమిస్తే అంతా రెడ్లే. వీటి అన్నింటినీ సమాజానికి తక్కువ చేసి చూపే ప్రయత్నంలో భాగమే రాష్ట్రంలో 56శాతం జనాభా ఉన్న 139 బీసీ కులాలకు 56 కులాల కార్పొరేషన్లను సృష్టించి 728 చైర్మన్, డైరెక్టర్ల పదవులను ఎవరి కుల పరిధిలో వారికి ఇవ్వడం జరిగింది. 109 జీ.ఓ.ప్రకారం 56 బీసీ కులాల కార్పొరేషన్లలో కొంత మంది చైర్మన్లకు ₹ 56వేలు, డైరెక్టర్లకు ₹ 12వేలు, మరి కొంత మంది చైర్మన్లకు ₹ 65వేలు, డైరెక్టర్లకు ₹ 14వేలు అన్ని అలవెన్సులు కలుపుకొని వేతనాలు ఇవ్వడం జరుగుతుందని తన సొంత మీడియా ద్వారా పెద్ద ప్రచారం చేసి చెప్పడం జరిగింది. కాని ఇదే రాష్ట్రంలో దాదాపు 850 పైగా నామినేటెడ్ పదవులకు నియమితమైన రెడ్లకు మాత్రం దాదాపు అన్ని అలవెన్సులు కలుపుకొని ₹ 3లక్షలు డ్రా చేస్తున్నారని ఒక అంచనా ఉంది. కాని వీరికి సంబంధించిన వేతనాలను గురించి మాత్రం ఏ మీడియా ప్రచారం చేయలేదు. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ లో వెంగలమ్మచెరువు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ వైసీపీ మన రెడ్ల పార్టీ, ఈ పార్టీకి నువ్వు లోకల్, నేను లోకల్. ప్రస్తుత  మంత్రి శంకరనారాయణ గారు బాడుగకు వచ్చినాడు, మనందరితో బాగుంటే ఉంటాడు, వైసీపీ 52 మంది రెడ్లకు టికెట్లు ఇస్తే 51 మంది రెడ్లము గెలిచాము. ఇందుకు అన్ని వర్గాల వారు ఓట్లు వేసినారు అంటూనే వైసీపీ మా రెడ్ల పార్టీ అని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పడం మనందరికీ తెలిసిందే. అగ్రకుల రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చేటప్పుడు మొదట బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చినామంటారు. ఆ తర్వాత మీ కులానికి ఇన్ని సీట్లు ఇచ్చినామంటారు. ఆ విధంగానే రాష్ట్రమంతటా ప్రచారం చేసి ఈ వర్గాలతో ఓట్లు వేయించుకొంటారు. గెలిచిన తర్వాత ఆ ఎంపీ లేదా ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో ఉన్న తమ కులపొలకు ఏవైనా సమస్యలపై సహాయం చేయడానికి ముందుకు వస్తే, నీవు నీ నియోజకవర్గంలో చూసుకోవాలని అంటారు. అదే రెడ్డి, కమ్మ ప్రజాప్రతినిధులు ఏ నియోజకవర్గంలోనైనా వారి కులపోలకు అన్ని పనులు చేసి పెట్టడం జరుగుతావుంది, ఇది వారు మాట్లాడిన వీడియోలే స్పష్టం చేస్తున్నాయి. తమకు అధికారం ఉందనే అహంకారంతో అనంతపురం జిల్లా కలెక్టరు గారిని, నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని రెడ్డి ఎమ్మెల్యేలు బహిరంగంగానే దుర్భాషలాడడం జరిగింది. ఇక రాష్ట్రంలో సామాన్యమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనుల స్థితిగతులు ఎంత ఘోరంగా ఉన్నాయో అనేది ఈ ఇరవై ఆరు నెలల పాలనా కాలంలో జరిగిన అనేక సంఘటనలే తెలుపుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం కూడా మా పార్టీ బీసీల కోసమే పుట్టింది. కనుక మా పార్టీ బీసీల పార్టీ, మా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అంటూనే రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవుల్లో అన్ని కీలకమైన పదవులను, రాష్ట్ర సంపదను దోచే పదవులను కేవలం తన కమ్మ కూలనికే ఇచ్చుకోవడం జరిగింది. దీనివలననే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైందని గట్టిగా చెప్పవచ్చు. వీటి అన్నింటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరి కుల పార్టీ అధికారంలో ఉంటే వారు, వారి కులపొలకే అన్ని చేసుకోగలుగుతున్నారు. బహుజనుల నాయకుడు గౌరవ స్టాలిన్ గారి నాయకత్వాన డిఎంకె పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చినందున అన్ని కులాలవారికి దాదాపు వారి జనాభా దామాషా ప్రకారం మంత్రి పదవులు లభించాయి. కనుక ఆంధ్రప్రదేశ్ లో బహుజన రాజ్యాధికార సాధన కోసం "ఆంధ్ర బహుజన ప్రజావేదిక" ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతావుంది. కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యావన్మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అభ్యుదయ భావాలున్న వారందరూ మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మాజీ జడ్.పి.టి.సి.గఫార్,పుట్టపర్తి నియోజకవర్గం కన్వీనర్ కప్పల రవి, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటగిరి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ఆర్.హరిప్రసాద్ బహుజన్ , పుట్టపర్తి నియోజకవర్గం కో-కన్వీనర్ వి.రవియాదవ్, వళ్ళం రమేష్, ఎస్.ఓబులేసు, ఉద్దండం సుధాకర్, రాము, బండా తిరుపాలు, కె.వెంకటరమణ, అశోక్ నాయుడు, శ్రీరాములు, అంజినప్ప, ఆదినారాయణ, భైరవ, శ్రీరాములు, ఉత్తన్న, రామచంద్ర(మట్టి), నాగరాజు, వై.లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

                                 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: