గుర్తింపు కార్డులు ఇవ్వండి
కమ్యూనీటి భవన నిర్మాణానికి సహకరించండి
జిల్లా బీసీ వెల్పేర్ అధికారికి మంగలి మహసభ జాతీయసంఘం వినతి
(జానోజాగో వెబ్ న్యూస్-అనంతపురం ప్రతినిధి)
మంగళి కులస్థ కళాకారులందరికీ గుర్తింపుకార్డులు మంజూరు చేయడంతోపాటు, కదిలో మంగళి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని జిల్లా బీసీ వెల్పేర్ అధికారికి మంగలి మహాసభ జాతీయ సంఘం కోరింది. ఈ మేరకు ఆ అధికారికి ఓ నేతలు ఓ వినతి పత్రం అందించారు. అందులోని సమాచారం ఇలావుంది. అనంతపురం జిల్లాలోని 63 మండలాలకు చెందిన మంగళ వాయిద్య కళాకారులు దాదాపు 4 వేల మంది డోలు సన్నాయి, షాక్సఫోన్, బ్యాండు షెట్టు వాయించుకొంటూ తమ కుటుంభాాలను పోషించుకొంటున్నారని, మా కుల కళాకారులకు గతంలో బీసీ,వెల్పేర్ ద్వారా 63 మండలలా నుండి కళాకారులను గుర్తిచి అనంతపురం బీసీ,వెల్పేర్ ఆఫిసర్ ద్వారాప్రభుత్వ గుర్తింపు కార్డు మంజూరు చేశారని తెలిపారు. ఇంకా జీల్లాలో కోన్ని గ్రామాలో,మండలాలో కళాకారుల గుర్తింపు కార్డు కొంత మందికి మంజూరు కాలేదు అలాగే బార్బర్ షాపులో పనిచేస్తున్న క్షౌర వృత్తి దారుల కుడా ప్రభుత్వ బీసీ వెల్పేర్ ఆఫీస్ నుండి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ మా యెక్క వృత్తిలో చాల మంది వాయిద్య కళాకారులు క్షౌరవృత్తి దారులు ఉన్నారు.
మండలాలో ఉన్న బీసీ,వెల్పేర్ ఆఫిస్ ద్వారా మా కులసంఘియులను గుర్తించాలని వెంటనే జీల్లా ఉన్నటువంటి మా సోదరులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజురు చేయలని కోరుతున్నాం, కదిరి నియోజకవర్గంలో మంగళ వాయిద్య కళాకారులు వృత్తిదారులు మా కుల బాంధవులు దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా 7000 మంది నివసిస్తున్నారు. గతంలో నాయి బ్రాహ్మణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో ప్రతి ఒక్క కళాకారుడు మేళం వాయించి తద్వారా డబ్బులు పోగు చేసి కదిరి పట్టణం నందు కమ్యూనిటీ స్థలం కావాలని అందరూ తమ తమ శక్తి కొద్దీ ప్రయత్నించి కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సహకారంతో కుల బంధువులకు అందరికీ కమ్యూనిటీ స్థలం హిందూపూర్ రోడ్డు వెంకటరమణస్వామి గుడి వెనక 12 సెంట్లు స్థలం కొనుగోలు చేయడం జరిగినది, దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి అయినా మీ ద్వారా ప్రభుత్వ ఉన్నత అధికారులు ,ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నేతలు అనంతపురం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో మంగలి మహాసభ జాతీయ కన్వీనర్ కె.ఆర్ హరిప్రసాద్ మంగలి. అనంతపురం మంగలి మహాసభ కన్వీనర్ ఆంజనేయులు బీసీ విద్యార్థి సంఘం నాయకులు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: