అవినీతి గురించి టీడీపీ నేతలు మాట్లాడటమా
వారి మాటలు హాస్యాస్పదం
వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
అవినీతి గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై కేసులు పెడితే విచారణకు భయపడి స్టే తెచ్చుకునే అవినీతి అనకొండలు ఆ పార్టీ నేతలు.. లక్షన్నరకోట్ల రూపాయలు అవినీతి లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లకు జమ చేసాం.. సూర్యుణ్ణి పెట్టి వెతికినా మా ప్రభుత్వంలో అవినీతి కనపడదు.. ఇక రోడ్లు అంటారా.. మేము వచ్చిన రెండేళ్లలో దాదాపు 10 వేల కోట్లతో రోడ్లు వేస్తున్నాం.. మరమత్తులు చేపడుతున్నాం.. ఎక్కడో ఒకచోట రోడ్డు పాడయిందని బూతద్దంలో చూపించడం విడ్డూరంగా ఉంది.. ఈ గుంతలను ప్రశ్నించే టీడీపీ మేతావులు.. వారి హయాంలో ఏం గాడిదలు కాసినట్టు...? అని ఆయన ధ్వజమెత్తారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: