రెండోవ వైస్ ఛైర్మన్ గా..
కుమ్మరి అంజలిదేవి ఎన్నిక
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారంనాడు వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా స్పెషల్ కలెక్టర్ సరళ వందనం ఆధ్వర్యములో, మార్కాపుపం నియోజక వర్గం ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి, పురపాలక కమీషనర్ నయీమ్ అహమ్మద్, ఛైర్మన్ బాల మురళీకృష్ణ, వైస్ ఛైర్మన్ షేక్. ఇస్మాయిల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలలో 12వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి అంజలిదేవి w/o కుమ్మరి శ్రీనుని రెండవ వైస్ ఛైర్మన్ గా పురపాలక సంఘం కౌన్సిలర్ల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా అంజలిదేవి మాట్లాడుతూ పురపాలక సంఘ సిబ్బందితో పాటు తమకు సహకరించి నన్ను ఈ స్ధాయికి కారణమైన 12వ వార్డు ప్రజలందరికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమములో కుమ్మరి హరి, షేక్. వదూద్,షేక్ రఫీ,గఫూర్, రచనమ్మ, నూర్జహాన్ , మహబూబ్బి మహిళలతో పాటు వార్డు ప్రజలు మరియు పురపాలక సిబ్బంది, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: