ఆటో వర్కర్స్ కు...

సంక్షేమ బోర్డు ఏర్పాటు...భీమా సౌకర్యం కల్పించాలి

ఏఐటీయూసీ డిమాండ్


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఆటో వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు వారికి భీమా సౌకర్యం, ఇతర సదుపాయాలు కల్పించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. మార్కాపురం రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో శుక్రవారంనాడు పూల సుబ్బయ్య భవనములో సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా అందే నాసరయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ ఖాసిమ్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగులు ఆటో కార్మిక రంగానికి ఎక్కువగా వలస వస్తున్నారు వీరికి ఉపాధిగా ఆటో రంగానికి ఎన్నుకున్నారు వీరు మార్కాపురం పట్టణంలోనే ఎక్కువ శాతం మంది ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు

వీరికి ప్రభుత్వం ద్వారా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సంక్షేమ బోర్డు ద్వారా ఆటో స్పేర్ పార్ట్స్ షాపులు కూడా ప్రభుత్వం నిర్వహించాలని వీరికి ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరినారు ఆటో కార్మికులు నూతన కమిటీని ఎన్నుకున్నారు రైల్వే స్టేషన్ రూటు నూతన అధ్యక్షుడిగా వై వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎం జానీ ప్రధాన కార్యదర్శిగా ఎంపి రాములు కోశాధికారిగా వి ప్రసాద్ కొంతమందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు తీర్మానాలు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని మార్కాపురం నుండి రైల్వే స్టేషన్ కు ఆటోలకు అదనంగా ఐదు రూపాయలు పెంచుతూ తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: