తర్లుపాడు మండలం రైతు భరోస కేంద్రంలో,,

 వై ఎస్ ఆర్ రైతు భరోస - చైతన్య యాత్ర

ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని రైతు భరోస కేంద్రంలో వై ఎస్ ఆర్ రైతు భరోస - చైతన్య యాత్ర కార్యక్రమం జరిగింది. సర్పంచ్ పల్లెపోగు వరాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానకిి ముఖ్య అతిధిగా విచ్చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రైతుభరోస కేంద్రము నందు రైతులకు శిక్షణ కార్యక్రమము ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోస కేంద్రాలు ఏర్పాటు చేసిన తరువాత సమూలమైన మార్పులను తీసుకొనిరావడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయంచేసే రైతులకు వివిధ రకాలైనటువంటి సంక్షేమ పధకాలను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వ్యవసాయ కార్యలయాల చుట్టూ తిరుగుతూ తమ కాలన్ని డబ్బును వృధాచేసుకొంటూ కాళ్లు అరిగేల తిరిగిన తమ పనులు పూర్తి చేసుకోలేక పోయేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో వున్న మొత్తం 31 రైతుభరోస కేంద్రాలు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రైతుదినోత్సవ కార్యక్రమము  ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో జిల్లా జాయింట్ డైరక్టర్ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 5గురు సభ్యులతో గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని తమ వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సబ్సిడి లోన్స్, సబ్సిడి విత్తనాలు, మరియు వ్యవసాయ సామాగ్రి పొందాలని తెలియచేశారు. దర్శి నుండి వ్యవసాయ శాస్త్రవేత్త భారతి మాట్లాడుతూ ప్రతి రైతు తమ పంటకు సంబంధించి నేలను బట్టి ఏ ఎరువులను వాడాలో , ఎక్కువగా కృతిమ ఎరువులను వాడుకుంటూ వుండాలని తెలిపారు. ఈ కార్యక్రమములో ఎడిఎ, ఎఓ చంద్రశేఖర్, హార్టి కల్తరల్ అధికారి, ఎమ్ డి ఓ  నరసింహులు, ఎమ్ఆర్ ఓ శైలేంద్రకుమార్ , ఎపిఎమ్ పిచ్చయ్య , ఉప సర్పంచ్ వెన్నా సత్యం, సహకారబ్యాంక్ డైరక్టర్ సత్యనారాయణ రెడ్డి, సంబంధిత అధికారులు , రైతులు పాల్గొన్నారు.
 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: