ఎంపీసీ విభాగంలో సీట్లు ఖాళీ
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ప్రిన్సిపల్ సాదియా జబిన్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ యాకుత్ పుర గల్స్-2 కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగం నందు కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని, వీటిలో చేరేందుకు అర్హులైన పేద ముస్లింలు ముందుకు రావాలని ఆ కాలేజీ ప్రిన్సిపల్ సాదియా జబిన్ కోరారు. ఈ సీట్లలో చేరేందుకు ఇంకా అవకాశముందన్నారు. నాణ్యమైన విద్యతోపాటు కట్టుదిట్టమైన సంరక్షణతో కూడిన ఉచిత హాస్టల్ వసతి కూడా కలదని ఆమె తెలిపారు. కార్పోరేట్ కళాశాలను ఢీకొనే రీతిలో నాణ్యమైన విద్య ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆసక్తి కలవారు సెల్ నెం-79950-57907 నెంబర్ కు సంప్రదించగలరని ఆమె కోరారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: