మూడో దశ ముపుదాగివుంది

సామూహిక ప్రార్థనలొద్దు

కోవిడ్ నిబంధనలు పాటించండి

రాష్ట్ర ముస్లింలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సూచన


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కోవిడ్ మూడో దశ ముపు ఉన్నందున బక్రీద్ పండుగ వేడుకలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేపడదామని రాష్ట్ర ముస్లింలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సూచించారు. ఈద్గాలలో సామూహిక పార్థనలు వద్దని ఆయన పేర్కొన్నారు. అందరి ఆరోగ్యాల దృష్ట్యా కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగకు సంబంధించి సామూహిక నమాజులను ఈద్గాలలో, బహిరంగ ప్రదేశాలలో ఆచరించడం పూర్తిగా నిషేదించడమైనదని తెలిపారు. సదరు ఈద్ నమాజును తమతమ మసీదులలో 50% ముసల్లీలకు మించకుండా నమాజును ఆచరించవలెనని. పరస్పర అలింగనం, చేతులు కలపడం చేయరాదని, గుంపులు గుంపులుగా బహిరంగ ప్రదేశాలలో గుమికూడరాదని. వధశాలల  వద్ద మాస్కులు, చేతి గ్లౌసులు తప్పక ధరించవలెనని. ప్రత్యేకించి ముసలి, చిన్న పిల్లలు మార్కెట్లలో, వధ శాలల వద్ద కలియతిరగడం చేయరాదని, తప్పని సరిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం ద్వారనే కరోనా మహమ్మారిని తరిమికొట్టగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కింది మార్గదర్శకాలను పాటించి ముస్లింలందరూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. 

 

👉ఈద్-ఉల్-అధా(బక్రీద్) ప్రార్థనలో Covid-19 నిబంధనలు తప్పనిసరి.

👉ఈద్గాలలో మరియు  బహిరంగ ప్రదేశాలలో ప్రార్థనలు పూర్తిగా నిషేధం.

👉మసీదులలో 50 % ముసల్లీ లకు మించకుండా నమాజ్ ను ఆచరించవలెను.

👉పరస్పర ఆలింగనము మరియు చేతులు కలుపడము చేయరాదు.

👉ప్రార్థన సమయంలో   మాస్క్ లు మరియు చేతికి గ్లౌజులు తప్పనిసరి ధరించాలి.

👉ప్రార్థనలకు చిన్నపిల్లలు వృద్ధులకు అనుమతి లేదు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: