గిరిజనులు సాగు చేసుకొంటున్న ఆ భూములకు...

ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకై చర్యలు తీసుకోండి

ఆర్డీఓ లక్ష్మీశివజ్యోతి ఆదేశం


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

 అటవీ ప్రాంతంలో  గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని మార్కాపురం ఆర్ డి ఓ లక్ష్మీశివజ్యోతి తెలిపారు. ఎఫ్ డి ఎఫ్ సి సమావేశం బుధవారం మార్కాపురం ఆర్ డి ఓ కార్యలయంలో జరిగింది. అర్హులైన గిరిజనులను గుర్తించే కార్యక్రమం ఈ నెల 25వ తేదిలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆర్ డి ఓ సూచించారు. అటవి , రెవిన్యూ శాఖల అధికారులు సమన్వయముతో పనిచేయాలన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను క్షేత్రస్ధాయిలో పరిశీలన చేయాలన్నారు. అనంతరం కమిటీ నిర్ధారణ చేసి పట్టాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. అటవి శాఖ అధికారిలు ఐటిడిఎ అధికారులు కలిసి పనిచేయాలన్నారు. అర్హులైన గిరిజనులకు అటవీ భూములపై హక్కు కల్పించాలన్నారు. ఇప్పటికే సేకరించిన వివరాలను సమగ్రంగా విచారణ తదుపరి కమిటీ సిఫార్సు మేరకు లబ్దిదారులకు భూములు కేటాయించాలన్నారు. కమిటీలోని అధికారులు పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ఆమె పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సబ్ డి ఎఫ్ ఓ వెంకట సందీప్, నారాయణ రెడ్డి, ఏపిఓ మురళీధర్, ఏటిడబ్ల్యూ ఎస్ దస్తగిరి మరియు శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: