టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా...

 శాసనాల.వీర బ్రహ్మం

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

        ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా శాసనాల వీర బ్రహ్మం తిరిగి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కె.అచ్చం నాయుడు నుండి నేడు అధికారిక ఉత్తర్వులు జారియ్యాయి. శాసనాల టీడీపీ పార్టీ ఆవిర్భావం  1982 నుండి నేటి వరకు దాదాపు 39 సంవత్సరాలుగా అదే పార్టీలో  క్రమశిక్షణ కలిగిన నాయకునిగా  బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. పార్టీ తొలినాళ్లలో మార్కాపురం మండల తెలుగుయువత అధ్యక్షులుగా,  జిల్లా ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. అలాగే జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శాసనాల  గుంటూరు, నెల్లూరు, క్రిష్ణ, చిత్తూరు జిల్లాలోని సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా పార్టీ పరిశీలకులుగా వెళ్లడం జరిగింది. విజయవాడ సిటీకి పార్టీ పరిశీలకులుగా దాదాపు రెండు సంవత్సరాలపాటు పనిచేశారు. ఈయనకు మంచి వక్తగా ప్రజల్లో పేరుంది. ఎంతటి సంక్లిష్ట విషయమైన సరే సమయానుకూలంగా హాస్య ధోరణిలో సామాన్య ప్రజలకు అర్ధమయ్యేలా, హత్తుకుపోయేలా ప్రసంగించడంలో ఈయన మంచి దిట్ట. తద్వారా ఈయన స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, అనంతరం చంద్రబాబు వద్ద ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరితో శాసనాలకు బాగా వ్యక్తి గత పరిచయాలు వుండడం విశేషం. టీడీపీ అధికారంలో వున్నప్పుడు నాటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, నేడు వైసీపీ పాలక పక్షం అనుసరిస్తున్న తిరోగమన విధానాల గురించి ప్రజలకు వివరించి చైతన్య పరచడంలో ఈయన ముందున్నారు. అలాగే టీడీపీ ఇచ్చిన ప్రతి పిలుపులో పాల్గొంటూ కార్యక్రమాలను జయప్రదం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.


పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా-శాసనాల

పార్టీ తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి,టీడీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శాయు శక్తుల కృషి చేస్తానని జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా తిరిగి నియమితులైన శాసనాల వీరబ్రహ్మం బుధవారం తెలిపారు. రెండు సంవత్సరాల పరిపాలన కాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని,ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కివెళ్లిపోయిందని విమర్శించారు. జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో పార్టీ కార్యక్రమాలు, అలాగే పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. తిరిగి పార్టీ అధికార ప్రతినిధిగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులకు శాసనాల వీర బ్రహ్మం కృతజ్ఞత తెలిపారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: