చినుకు పడితే...కాలు మోపలేం
ఇది బిలకలగూడుర్ బీసీ కాలనీ పరిస్థితి
గ్రామాన్ని దత్తత తీసుకొన్న జిందాల్ ది సవతి తల్లి ప్రేమేనా...?
చినుకు పడితే అందరిలో ఆనందం వెల్లుస్తుంది. కానీ కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడుర్ గ్రామంలోని బీసీ కాలనీ వాసులకు మాత్రం గుండె గుబులు పుట్టిస్తుంది. కారణం అక్కడ వర్షం పడితే చాలు ఇంట్లోనుంచి కాలు బయటకు మోపలేని దుస్థితి. తమ గొండును ఈ కాలనీ వాసులు ప్రతి అధికారి వద్ద వెలబోసుకొన్నారు. కానీ సమస్య నేటికీ పరిష్కారం కాని పరిస్థితి. ఇక్కడి ప్రజల పరిస్థితిపై మీడియా సైతం ఎన్నో సార్లు కథనాలు ప్రచురించింది. అయినా అధికార్లలో చలనం లేదు. దీంతో మా సమస్య ఎపుడు పరిష్కారమవుతుందని బిలకలగూడురు గ్రామ బీసీ కాలనీ వాసులు వాపోతున్నారు.
చినుకుపడితే బయట కాలుమోపలేని స్థితిలో తాము ఇక్కడ నివాసం ఉండేదెలా, బతుకు జీవనం సాగించేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయినా ఏ అధికారి నుంచి వారికి సమాధానం అందడంలేదు. ఇక ఈ గ్రామాన్ని జిందాల్ కంపెనీ దత్తతకు తీసుకొంది. పేరుకు దత్తత గ్రామమైనా నిరాధార గ్రామంగానే మారింది. కనీసం దత్తతతీసుకొన్న జిందాల్ యాజమాన్యమైన ఈ సమస్యపై స్పందిస్తారా లేక ప్రభుత్వ అధికార్లు స్పందిస్తారా..తమ గోడు ఎవరితో చెపుకోవాలి అన్న ఆందోళనను బిలకలగూడుర్ బీసీ కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికార్ల తీరు మారేనా...జిందాల్ యాజమాన్యం చేసిన దత్తత గ్రామం బాసలు నెరవేరేనా...? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: