మా సమస్యలు పరిష్కరించండి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశావర్కర్ల నిరసన

ఆర్డీఓ వినతి పత్రం అందజేత


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములో ఆశా వర్కర్ల సమస్యలపై   ఎ.ఐ.టి.యు.సి. నాయకులు అందే నాసరయ్య, ఖాసిమ్ ఆధ్వర్యంలో ఆర్.డి.ఓ.కు  వినతి పత్రం సమర్పించారు. స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలను కేటాయించిన చోటు నుండి మరోక చోటుకు మారుస్తున్నారని ముఖ్యంగా సచివాలయానికి వెళ్లిన ఆశ కార్యకర్తలను కొన్ని సచివాలయాల సిబ్బంది, ఏఎన్ఎమ్ లు మాకు సరియైన విలువ ఇవ్వకుండ చిన్నచూపు చూస్తున్నారని ఆశా వర్కర్లు  తెలియచేశారు.  ఈ విధంగా మాకు గుర్తింపులేని కార్యలయాలకు మమ్మల్ని పంపొద్దని వారు కోరారు. కొందరూ డాక్టర్లు సమస్యలతో వెళ్లిన ఆశ వర్కర్లపై మీ   సమస్యలతో మాకు సంబంధంలేదు, మేము చెప్పిన విధంగా మీరు చేయవలసిందేనని చేయకపోతే ఇంటికి వెళ్లిపోండి అని కఠీనంగా అంటున్నారు ఆశా కార్యకర్తలను  మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి మాఈ ఉద్యోగాలను పర్మినెంట్ చేసి కనీస వేతనము

రూ.21 వేలు ఇవ్వాలని వీటితోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్స్ ఇస్తూ ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎంలు గా ప్రమోషన్ ఇవ్వాలి.  కరోనా  అలవెన్సులు ఇవ్వాలి కరోనాతో మరణించిన ఆశా వర్కర్ల కు 50 లక్షల బీమా అందజేయాలి, వీరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలలో ప్రాధాన్యత యివ్వాలి, ఖాలీగా వున్న ఆశ కార్యకర్తల పోస్టులను  భర్తీ చేయాలి, వీరిపై వినియోగిస్తున్న పనిభారం తగ్గించాలి,  ఆశా కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ పథకము చేయూత అందజేయాలంటూ పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్.డి.ఓ. కు అందచేశారు.  ఈ కార్యక్రమంలో అందే నాసరయ్య సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి షేక్ ఖాసీం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు డీకే అరుణ పి పద్మావతి ది శిరోమణి ఎస్ నర్సమ్మ డి టీ కాశీరత్నం జే బుజ్జి బీఫ్ పూర్ణ జ్యోతి డి.జే పద్మ వి సులోచన,ఏ నిర్మల మొదలగు వారు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: