అనుమానితులను వెంటనే అరెస్టు చేసి విచారణ చేయాలి 

-హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐను సస్పెండ్ చేయాలి

 -న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలసిద్ధంకు 

 -కెవిపిఎన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి 


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం మండలం మలుగూరు గ్రామ చెరువులో శవమై తేలిన అదే గ్రామానికి చెందిన నరసింహమూర్తి మృతి చెందిన కేసులో అనుమానితులను వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కెవిపిఎన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి, మృతుని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమెండ్ చేస్తు కెవిపిఎస్ ఆద్వర్యంలో సిపిఎం, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మలగూరు నుండి హిందూపురం తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మలగూరు గ్రామంలో పాదయాత్ర ప్రారంభానికి ముందు సభను నిర్వహించి, అక్కడి నుంచి స్మణాననికి వెళ్లి నరసింహమూర్తి సమాది వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించారు . అనంతరం అక్కడి నుంచి పెద్ద ఎత్తున నాయకులు , కార్యకర్తలు , దళిత యువకుల • కలిసి సుమారు 12 కిలోమీటర్ల వరకు డప్పులు వాయింస్తు పాదయాత్ర నిర్వహిస్తు పట్టణంలోని తహసీల్దార్ కార్యలయం వరకు సాగింది.

తహసీల్దార్ కార్యలయం ముందు ఆందోళన చేశారుదీ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆం డ్ర మాల్యాద్రి , సిపియం జిల్లా కార్యదర్శి ఇంతీయాజ్ , సిఐటియు జిల్లా కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ , కెవిపిఎస్ జిల్లా అద్యక్ష కార్యదర్శులు హనుమయ్య , లింగన్న ముస్లీంనగార అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ లు మాట్లాడారు. దళితులంటే అధికారు కు , పోలీసులకు అంత అలుసా ... దళితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా ... అదే అగ్రవర్ణలకు చెందిన వారు ఫిర్యాదు చేస్తే క్ష జాల్లో కేసులు నమోదు చేసే పోలీసులు నరసింహమూర్తి కేసు విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్ర శ్నించారు. హిందూపురం రూరల్ మండలం మలగూరు గ్రామానికి చెందిన దళిత నరసింహామూర్తి , హిందూపురం పురపా లక సంఘ పరదీలోని కొట్నురు వద్ద ఉన్నా మంజునాధ ఎజెన్సీ క్రింద నిర్వహిస్తున్న భారత్ పెట్రోలియం బంక్ లో పని చేస అన్నాడు . ఏప్రిల్ 28 , 29 , 30 వ తేదీలలో బంకులో పనిచేశారని , అనంతరం తన కుమారుడు కనిపించలేదని యువకుడి త లిదండ్రులు అంటున్నారు . అయితే మే 8 వ తేదీ దళిత సరసింహమూర్తి శవం మలుగూరు చెరువులో దొరకింది . అప్పటికే ఆ మృత దేహం అప్పటికే శవం కుళ్లి పోయింది . దీంతో శవం ఎవరిది అన్నది తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు సైతం వ సృత దేహం ఎవరిది అన్నది గుర్తు పట్టలేక పోయారు . అసుషత్రికి మృత దేహం తీసుకెళ్లడానికి సైతం సాధ్యం కాక పోవడం తో చెరువు దగ్గరే పోసు మార్టం సైతం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడంలో పూర్తిగ ఫలమైనట్లు తెలుస్తుందన్నారు.

 

నరసింహమూర్తిది హత్య ... లేదా ... ఆత్మహత్య అన్నది మూడు మాసాలు అయినా పోలీసులు తేల్చలేక పోయారు . అయితే మృతుని కుటుంబ సభ్యులతో పాటు కెవిపిఎస్ , సిపియం , దళిత ప్రజా సంఘాలు అన్ని ఏకమై నరసింహమూర్తిది హత్యనని పెంట్రోల్ బంకు యజమానిని అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ చేయాలని డిమెండ్ చే స్తున్నప్పటికి రూరల్ పోలీసులు దానిపై దృష్టి సారించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు . నరసి O హమూర్తి తల్లి దండ్రులు తన కుమారునిది హత్యనని పెట్రోల్ బంకు యజమానిపై అనుమానం ఉందని , తమకు ఫోన్ చే సి బెదరింపులకు పాల్పడినట్లు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే వారి ఫిర్యాదును స్వీకరించలేదు ... దీంతో తల్లిదండ్రుల రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పొంపినప్పటికి దానిని సైతం స్టేషన్ అధికారులు తిరస్కరించారు . దీనిని బట్టి చూస్తే దళిత ఎలు పిర్యాదులు చేసిన అధికారులు తీసుకోవడం లేదన్నది తేలిపోయిందన్నారు . వెంటనే కేసు నమోదు చేసి అనుమానితుల ను అదుపులోకి తీసుకుని విచారణ యాలన్నారు . దీంతో పాటు మృతుని కుటుంబానికి చట్టప్రకారం రావలసిన రూ .20 ల క్షల నష్టపరిహారం , ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి . కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం , పెన్షన్ తక్షణం ప్రభుత్వం అ మలు చేయాలి డిమెండ్ చేశారు . లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేసి..చలో హిందూపురం కార్యక్రమం చేసి హిం దూపురాన్ని దిగ్భదనం చేస్తామన్నారు . ఆందోళన విషయం తెలుసుకున్న పట్టణ సిఐ బాలమద్దిలేటి తహసీల్దార్ కార్యలయం చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని ఆందోళన విరమించాలని కోరారు . అయితే రూరల్ సిఐ వచ్చి కేసు నమోదు చేస్తామ ని హామి ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు . దీంతో ఇరువురు మధ్య కాస్తా వాగ్వివివాదం జరిగింది . వెంటనే తహసీల్దార్ శ్రీనివాసులు కలుగజేసుకుని బాధితులకు న్యాయం చేస్తామని ... నరసింహమూర్తి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు . ఈ కార్యక్రమ ంలో నాయకులు పెద్దన్న , వెంకటేష్ , వినోద్ కుమార్ , నాగరాజు , అనీల్ , నాగరాజు , కిరణ్ , లింగారెడ్డి , బాబావలి , తో పాటు సిపియం , అనుబంద ప్రజా సంఘాల నాయకులు , గ్రామస్తులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: