కోవిడ్ బాధితుల సేవలో...జానోజాగో సంఘం 

జానోజాగో నేత మెహరాజ్ కు కృతజ్ఞతలు తెలిపిన కోవిడ్ బాధితుడు బడే సాబ్  


(జానోజాగో వెబ్ న్యూస్-సిరిసిల్ల ప్రతినిధి)

ముస్లిం హక్కుల కై పోరాటం చేయడంలోనే కాదు ప్రజా సేవలోనూ పాలుపంచుకోవడం జానోజాగో సంఘం ముందుంటుంది. ఇటీవల కరోనా వేళ జానోజాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం నేతలు, కార్యకర్తలు పలుచోట్ల సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా రాళ్లపేట మండలం తంగళ్లపల్లి చెందిన సయ్యద్ బడే సాబ్ అనే కోవిడ్ బాధితుడు  వైద్యం విషయంలో సరైన దశదిశ లేకుండా బాధపడుతున్న సమయంలో ఆ వ్యక్తికి జానోజాగో కేంద్ర కమిటీ సభ్యులు మెహరాజ్ వైద్యం విషయంలో అన్ని విధాలుగా సహకరించారు. ఆ వ్యక్తికి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించడమే కాకుండా అతనికి ఎళవేళల వైద్యం సరైన రీతిలో అందుతోందా అన్నది కూడా కేంద్ర కమిటీ సభ్యలు మెహరాజ్ పర్యవేక్షించారు. నిరంతరం వైద్యులను సంప్రదించి సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకొన్నారు. కోవిడ్ బాధితుల సేవలో పాలుపంచుకొంటున్న తమ సంఘం కేంద్ర కమిటీ సభ్యలు మెహరాజ్ ను జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ అభినందించారు. ముస్లిం సమస్యలపైనే కాకుండా కుల, మతాలకు అతీతంగా ప్రజా సేవలో పాలుపంచుకోవడం కూడా తమ సంఘం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

 

కోవిడ్ బాధితుడు సయ్యద్ బడే సాబ్


ఇలాంటి సేవ కార్యక్రమాలు ప్రతి జిల్లాలలో చేపట్టాలని జానోజాగో సంఘం నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఇదిలావుంటే కోవిడ్ బాధితుడు సయ్యద్ బడేసాబ్ మాట్లాడుతూ...నేను సయ్యద్ బడేసాబ్ . రాజన్న సిరిసిల్ల జిల్లా రాళ్లపేట మండలం తంగళ్లపల్లి నాది. నాకు కరోనా వచ్చి శ్వాసతీసుకొనేందుకు కష్టంగా ఉన్న సమయంలో. నేను ప్రాణపాయ స్థితిలో ఉన్నపుడు నా కొడుకు జానో జాగో సంఘం కేంద్ర కమిటి సభ్యులు మెహరాజ్ కు ఫోన్ చేయగా అయన ప్రభుత్వ ఆసుపత్రి సూపడెంట్, డాక్టర్ రాధాకృష్ణ కు ఫోన్ చేసి చెప్పి మెరుగైన వైద్యం అందేలా చేశారు. నాకు మెరుగైన వైద్యం అందించిన బతికించినందుకు ప్రతి డాక్టర్ కు, ప్రతి నర్సుకు, ముఖ్యంగా జానోజాగో సంఘం కేంద్ర కమిటీ సభ్యులు మెహరాజ్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా వస్తే ప్రైవేటు ఆసుపత్రులకు వద్దు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మంచి వైద్యం అందుతంది. ఇక నేను సంతోషంగా ఇంటికి వెళ్తాను. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

              


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: