టీడీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదం
వెలిగొండను విస్మరించారనే ప్రజలు ఓడించారు
వైసీపీ నేత ఏలూరి రామ చంద్రారెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
వెలిగొండ నిర్మాణం పూర్తి దశలో ఉన్నప్పుడు తమ పార్టీ అధికారం కోల్పోయిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం ఇంతకన్నా జోక్ మరొకటి ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.. వెలిగొండ ప్రాజెక్టులో దమ్మిడీ పని చేయలేదనే ప్రజలు టీడీపీని తరిమికొట్టారని ఆయన అన్నారు.. ఒకవేళ వెలిగొండలో టీడీపీ ప్రభుత్వం పనులు చేసిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంటే.. ఈ ప్రాజెక్టు ప్రభావిత నియోజకవర్గాల్లో ఎందుకు దారుణంగా ఓడిపోతుందని ఏలూరి ప్రశ్నించారు.
ఇటీవల వెలిగొండ విషయంలో వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి టీడీపీ చేస్తున్న కవర్ డ్రైవ్ లు ప్రజలకు హాస్యం పుట్టిస్తున్నాయని అన్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలన్న టీడీపీ తాపత్రయం ఎప్పటికీ సఫలీకృతం కాదన్నారు. వెలిగొండను మొదలు పెట్టింది, కొనసాగించింది, పూర్తి చేస్తుంది వైఎస్ కుటుంబమే అన్నది విస్పష్టం అని ఏలూరి వెల్లడించారు. ఇక పశ్చిమ ప్రకాశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలను కూడా తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం తోపాటు, దోర్నాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మార్కాపురంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళుతున్నట్టు ఏలూరి చెప్పారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: