ఘనంగా వై.ఎస్.జయంతి వేడుకలు

కదిలొచ్చిన పల్లే..పట్టణం


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

          ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రములోని  తర్లుపాడు, తుమ్మ లచెరువు గ్రామాలలో ఆయా సర్పంచ్ ల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగతనేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తర్లుపాడు సర్పంచ్ పల్లెపోగు వరాలు , తుమ్మలచెరువు సర్పంచ్ షేక్ షాజహాన్ ఆధ్వర్యములో బస్టాండు సెంటరు నందు మాజీ ముఖ్యమంత్రి దివంగతనేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్బంగా వై ఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 


ఈ సందర్భంగా మాజి ఎం.పి.టి.సి. షేక్ అక్బర్ అలీ  మాట్లాడుతూ  మన దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు మరువలేనివని గుర్తు చేశారు . ఈరోజు అదే బాటలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ప్రజల సంక్షేమం విషయంలో ఆరు అడుగులు ముందుకు వేస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది అడుగులు ముందుకువేసి నవరత్నాలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి సర్పంచ్ సూరెడ్డి సుబ్బారెడ్డి, వైస్ సర్పంచ్ వెన్నా సత్యనారాయణ రెడ్డి, వి.ఆర్.ఓ. శేఖర్ రెడ్డి, మాజీ జడ్.పి.టి.సి సభ్యులు రావి భాషాపతి రెడ్డి , షేక్ రసూల్, ఎ.ఎ. భోపాల్, విఆర్ఓ రమణరెడ్డి , పంచాయతి సెక్రటరి భట్టు శ్రీనివాసులు మరియు గ్రామ వాలంటీర్స్ పలువురు మండల  వైసిపి నాయకులు, వార్డ్ నెంబర్లు పట్టణ, పరిసర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: