ఇన్నాళ్లకు మేలుకొన్నారు...

గతంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని వైనం

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

శుద్ధ జలం పేరుతో  వాటర్ ప్లాంట్ యజమానులు ఏ మాత్రం నాణ్యతలేని మంచి నీటిని అపరిశుభ్ర బబుల్స్ లలో నింపి మినరల్ వాటర్ పేరిట ఇలాంటి నిబంధనలు పాటించకుండా విక్రయిస్తున్నారు,, మార్కాపురం పట్టణం పరిసర ప్రాంతాలలో ఎలాంటి గుర్తింపు లేని మినరల్ వాటర్ ప్లాంట్ లు కోకొల్లలుగా ఉన్నాయి,,, నిబంధనలు పాటించకుండా వాటర్ ప్లాంట్ల యజమానులు గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తున్నారు,, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాటర్ ప్లాంట్ల పై పలు సామాజిక సేవ సంస్ధలు " నీళ్లు " పేరిట పలు పత్రికలలో వరుస గా వార్తా కథనాలు వెలువడినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా అంతా" మామూలే" కదా అంటూ వ్యవహరించారు,, మరి ఇప్పటికిప్పుడు ఏమైందో తెలియదు గానీ ప్రజారోగ్య దృశ్య అంటూ వాటర్ ప్లాంట్లపై దృష్టి సారించారు,,

గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా దృష్టిపెట్టి వాటర్ ప్లాంట్ అనుమతులు, వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల శాఖ అనుమతి, రెవెన్యూ శాఖ అనుమతి, ఫుడ్ సేఫ్టీ, మరియు స్టాండర్డ్ అత్తారింటికి ఆఫ్ ఇండియా అనుమతి,, తూనికలు కొలతల శాఖ వారి అనుమతి, వాటర్ ప్లాంట్ నందు టిడిఎస్ మీటర్ పరీక్షించే ల్యాబ్ టెక్నీషియన్ ల వివరాలు, తదితరాల నకలు  కాపీలను మున్సిపాలిటీ కార్యాలయంలో సమర్పించాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు జారీ చేయడం జరిగింది,, అయితే ఇది మంచి పరిణామమేనని ఈ పని మున్సిపల్ అధికారులు ముందే చేసి ఉంటే అనుమతులు లేని వాటర్ ప్లాంట్ల సంఖ్య  పుట్టగొడుగుల వెలసి ఉండేవి కావని ఇప్పటికైనా తీసుకున్న చర్యలు కఠినంగా ఉండేలా చూడాలని  నిబంధనలకు లోబడి వాటర్ ప్లాంట్ నడుపుకుంటున్న యజమానులు అంటున్నారు.


 మునిసిపల్ ఛైర్మన్ బాల మురళీకృష్ణ

మునిసిపల్ వైస్ ఛైర్మన్ షేక్ ఇస్మాయిల్

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: