వివాదాస్పద గ్రామాల వివరాల సేకరణ

డిఎస్పి వి .నారాయణస్వామిరెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

   తర్లుపాడు మండల కేంద్రం నందు స్థానిక తాడివారిపల్లి పోలీస్ స్టేషన్ నీ దర్శి డిఎస్పి వి .నారాయణస్వామిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శించి వివాదాస్పద గ్రామాలు వాటి వివరాలు తెలుసుకోవడం జరిగిందని ఉన్నారు. తర్లుపాడు  లో కొత్తగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ముఖ్యంగా ప్రజలకు కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో సడలింపులు ఇచ్చారని విచ్చలవిడిగా తిరగకుండా ప్రజలకు జీవనాధారం కు ఇబ్బందిగా ఉందని సడలింపు  ఇచ్చారు అని అన్నారు. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని ప్రజలు మాస్కులు, శానిటైజర్, సామాజిక దూరం పాటించాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు, ఏ ఎస్ ఐ.సంజయ్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ శివారెడ్డి, సత్యం, సుబ్బారావు  పాల్గొన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: