వెన్నుముక కండరాల క్షీణత (ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్నారా

పెద్దలతో పాటుగా రెండు నెలలు, ఆపై వయస్సు చిన్నారులకు

నోటి ద్వారా చికిత్సనందించే మొట్టమొదటి ఒక్క ఔషదం రోష్‌ యొక్క ఎవ్రిస్డీ (రిస్డీప్లామ్‌)

ఇప్పుడు భారతదేశంలో లభ్యం


(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

రోష్‌ నేడు, వెన్నుముక కండరాల క్షీణత (స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ– ఎస్‌ఎంఏ) రోగుల కోసం భారతదేశంలో ఆమోదించబడిన  మొట్టమొదటి మరియు ఒకే ఒక్క చికిత్స ఎవ్రిస్డీ (రిస్డిప్లామ్‌)ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఎవ్రిస్డీను మొదటగా యుఎస్‌ ఎఫ్‌డీఏ ఆగస్టు 2020లో ఆమోదించింది. యుఎస్‌లో అనుమతించబడిన 11 నెలల  లోపుగానే ఇప్పుడు ఇండియాలో కూడా లభ్యమవుతుంది. ఆవిష్కరించిన నాటి నుంచి 50కు పైగా దేశాలలోని 4000 ఎస్‌ఎంఏ రోగులు ఎవ్రిస్డీ నుంచి ప్రయోజనం పొందారు.

అతి తీవ్రమైన, అభివృద్ధి చెందేటటువంటి న్యూరోమస్క్యులర్‌ వ్యాధి , ఎస్‌ఎంఏ. దీని వల్ల మరణమూ సంభవించవచ్చు. అంతర్జాతీయంగా ప్రతి 10000 జననాలలో దాదాపు ఒకరిపై ఇది  ప్రభావం చూపవచ్చు మరియు భారతదేశంలో  7744 జననాలలో  ఒకరిపై ఇది  ప్రభావం చూపుతుంది. శిశుమరణాలకు కారణమవుతున్న జన్యు కారణాలలో ఇది అగ్రగామిగా నిలుస్తుంది. సర్వైవల్‌ మోటర్‌ న్యూరాన్‌ 1(ఎస్‌ఎంఎన్‌1) జీన్‌ మ్యుటేషన్‌ కారణంగా ఎస్‌ఎంఏ వస్తుంది. దీని కారణంగా ఎస్‌ఎంఎన్‌ ప్రోటీన్‌ లోపిస్తుంది. ఈ ప్రొటీన్‌, శరీరమంతా కూడా లభ్యమవుతుంది.  కండరాలు మరియు కదలికలను నియంత్రించే నరాలు పనిచేయడానికి ఇది తప్పనిసరి. ఈ ప్రొటీన్‌ లేకుండా నరాలకు సంబంధించిన కణజాలం సరిగా పనిచేయదు. ఈ ప్రొటీన్‌ లోపిస్తే కొంత కాలానికి కండరాలు నీరసించిపోతాయి. ఎస్‌ఎంఏ  తరహా అనుసరించి, వ్యక్తుల శారీరక సామర్థ్యం మరియు వారు నడిచే తీరు, ఆహారం తీసుకోవడం లేదా శ్వాసించడం కూడా గణనీయంగా ప్రభావితం కావడం లేదా కోల్పోవడం జరుగవచ్చు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: