పట్టాదారు పాస్ పుస్తకం కోసం,,,

లంచం తీసుకుంటున్న పోతల పాడు వి.ఆర్.ఓ

సోషల్ మీడియాలో వీడియో హాల్ చల్


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

  ప్రకాశం జిల్లా తర్లుపాడు  మండలంలోని పోతల పాడు వి.ఆర్.ఓ. అంబడిపూడి. వెంకటేశ్వర్లు  పట్టాదారు పాస్ పుస్తకాల కోసం మరియు పొలం ఆన్ లైన్ లో ఎక్కించు టకు లంచం తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోతలపాడు వీఆర్వో వెంకటేశ్వర్లు మీద గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బాధితులు అందరూ ఒక్కరు ఒక్కరు గా వెలుగులోకి వస్తున్నారు. నిన్న గానుగపెంట, పోతలపాడు గ్రామ రైతు బాధితులు కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజితాసింగ్ కి వినతి పత్రం అందజేయగా విచారణ జరిపి రైతు బాధితుల నుండి స్టేట్మెంట్ తీసుకోమని తర్లుపాడు ఎమ్మార్వో శైలేంద్ర కుమార్ కు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీఆర్వో పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు బాధిత రైతులు వేడుకుంటున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: