చిరు వ్యాపారుల కోసం పీ.ఎం. స్వనిధి యోజనను...

సద్వినియోగం చేసుకోండి

మార్కాపురం మున్సిపల్ కమీషనర్, వైస్ ఛైర్మన్ పిలుపు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

  ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములోని మెప్మా కార్యాలయంలో కార్యాలయ ఇంచార్జ్ బి. అరుణ కుమారి ఆధ్వర్యములో  “ స్వనిధి సే సమృద్ధి “ అనే కార్యక్రమము నిర్వహించడమైనది. ఈ కార్యక్రమములో ముఖ్య అతిధులుగా పాల్గొన్న పట్టణ మునిసిపల్ కమీషనర్ నయీమ్ అహమ్మద్, వైస్ ఛైర్మన్ షేక్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన కష్టకాలంలో వీధి వ్యాపారులను, చిన్నచిన్న దుకాణాలు నడుపుకొనేవారిని ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వము “ పి.ఎమ్.స్వనిధి యోజన “  పధకాన్ని ప్రవేశ పెట్టిందని,


ఈ పధకం ద్వారా వీరిని ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదువేల కోట్ల రూపాయాలు కేటాయించింది, దరఖాస్తు చేసుకొనేందుకు ఎటువంటి కష్టతరమైన నిబంధనలు లేకుండా వడ్డీరాయీతీతో  పదివేల రూపాయాల  ఋణం పొందవచ్చు, ముఖ్యంగా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయివుండాలి, బ్యాంకు పాస్ బుక్ మరియు అర్బన్ లోకల్ బాడీస్ జారి చేసిన వెండర్ ఐ.డి. కార్డు (మునిసిపల్ లేదా సచివాలయ కార్యాలయాల ద్వారా  పొందవచ్చు) ఈ పత్రాల ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసికోవాలని తెలిపారు. ఈ కార్యక్రమములో డ్వాక్ర మహిళలు, ఆర్.పి.లు, స్వయం సంఘాల మహిళలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. 

మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ ఇస్యాయిల్  

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 



 


 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: