వైసీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతున్నాయ్
మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
వైసీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విమర్శించారు. శనివారంనాడు ప్రకాశంజిల్లా మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం లోని కొనకనమిట్ల గ్రామంలో జరిగిన మండల టిడిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగినది .ఈ సమావేశం నకు ముఖ్య అతిథులుగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విచ్చేసి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కొనకనమిట్ల మండలం లో వైసిపి నాయకులు అరాచకాలు ఎక్కువయ్యాయని, ఈ మండల వైసిపి నాయకులు సొసైటీ ద్వారా రైతులకు చెల్లించవలసిన నగదును కూడా అక్రమంగా తమ సొంత అకౌంట్లకు పది కోట్ల రూపాయలు తరలించారని మరియు మొక్కలు నాటే ఈ కార్యక్రమంలో మరో పది కోట్ల రూపాయలు సొంత ఖాతా లకు తరలించారని తెలిపారు. ఈ మండలంలో వైసిపి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని తద్వారా అమాయకుల నోట్లో మట్టి కొడుతున్నారని తెలిపారు. త్వరలోనే ఈ మండలంలో గ్రామస్థాయిలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని పటిష్ట చేద్దామని తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో పనిచేసి పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు , ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి పొల్లా నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, నాయకులు తాండ వెంకటేశ్వర్లు, మార్కాపూర్ పట్టణ యూత్ అధ్యక్షులు గొల్ల మారి కాశి రెడ్డి, మైనారిటి నాయకులు గులాబ్, మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వందలాదిగా పాల్గొన్నారు. ఆ తర్వాత కార్యకర్తలు ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయం నకు వెళ్లారు. ఆ తరువాత ప్రజా సమస్యలపై గౌరవ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఎంపీడీవో, ఎస్ ఐ ని కలసి ప్రజాసమస్యలు తెలియజేశారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: