సౌత్‌ కొరియన్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’....

తెలుగు రీమేక్‌ కోసం ‘ఓ బేబీ!’ తర్వాత మరోసారి,,,,

అసోసియేటైన సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్‌


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

‘ఓ బేబీ!’ విన్నింగ్‌ కాంబినేషన్‌ సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్‌ మరో మంచి చిత్రం కోసం మళ్లీ అసోసియేట్‌ అయ్యారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు, సునీతతాటి, హ్యూన్యూ థామస్‌ కిమ్‌ కలిసి సౌత్‌ కొరియన్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ను తెలుగు రీమేక్‌ను అధికారికంగా నిర్మించనున్నారు. రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నివేదా థామస్, రెజీనా తొలిసారి యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తున్నారు.

యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న ‘ఓ బేబీ’ మాతృక ‘మిస్‌గ్రానీ’ చిత్రం మాదిరిగానే, ‘మిడ్‌నైట్‌రన్నర్స్‌’ మూవీ కూడా గ్లోబల్‌ అప్పీల్‌ ఉన్న కథాంశం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే, వారు మెచ్చే అంశాలు అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా..ఈ చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మ తెలుగు ప్రేక్షకుల అభిరుచి, ఆకాంక్షలకు తగ్గట్లుగా కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. దీంతో ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌కు తప్పకుండ కనెక్ట్‌ అవుతుందని చెప్పవచ్చు. 

ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ మొదలైంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫైనల్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయాగ్రాహకులుగా ఉన్న ఈ చిత్రానికి మైకీ మెక్లేరే సంగీతం అందిస్తున్నారు.

తారాగణం: రెజీనా కసాండ్ర, నివేదాథామస్‌

సాంకేతిక విభాగం

డైరెక్టర్‌: సుధీర్‌వర్మ

ప్రొడ్యూసర్స్‌:డి.సురేశ్‌బాబు, సునీతతాటి, హ్యూన్యూ థామస్‌ కిమ్‌

నిర్మాణ సంస్థలు: సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్‌

సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌

మ్యూజిక్‌ డైరెక్టర్‌: మైకీ మెక్లేరే

ఎడిటర్‌: విప్లవ్‌ నైషాడం

లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌ దొంకాడ

ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడైకర్‌

మార్కెటింగ్‌: లిపిక ఆళ్లా

పీఆర్‌వో: వంశీ–శేఖర్‌

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: