రాయల్ బాబా మరణం సంఘానికి తీరని లోటు

జానోజాగో సంఘం జాతీయ కమిటీ, తెలుగు రాష్ట్ర కమిటీల సంతాపం

రాయల్ బాబా
(జానోజాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

జానోజాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాయల్ బాబా(ఖాజా అహ్మద్ బాబా) మరణం పట్ల ఆ సంఘం జాతీయ కమిటీ, తెలుగు రాష్ట్రాల కమిటీలు సంతాపం ప్రకటించాయి. రాయల్ బాబా మరణం సంఘానికి తీరని లోటు అని జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్, జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్, జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, కేంద్ర కమిటీ సభ్యులు మెరాజ్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ముంతాజ్ ఫాతిమా, ఏపీ రాష్ట్ర సమన్వయ కర్త షేక్ గౌస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాయల్ బాబా కుటుంభానికి అల్లాహ్ మనోనిబ్బరం ప్రసాదించాలని, వారి కుటుంభానికి అల్లాహ్ కరుణ ఉండాలని వారు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జానోజాగో సంఘం విస్తరణకుతన వంతు ప్రయత్నం రాయల్ బాబా చేపట్టారని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. జిల్లాలో జానోజాగో సంఘం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారని, ఆయన మరణం సంఘానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: