పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల పెంపుపై 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో...ఎద్దుల బండి తో వినూత్న నిరసన


నంద్యాల టౌన్ కాంగ్రెస్ కమిటీ సంతకాల సేకరణ

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

ఏఐసిసి ఆదేశానుసారం పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్, నంద్యాల పార్లమెంట్ డిసిసి లక్ష్మీ నరసింహ యాదవ్ సూచనల మేరకు నంద్యాల టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దాసరి చింతయ్య ఆధ్వర్యంలో అధికార ప్రతినిధి వాసు జిల్లా సెక్రెటరీ అబ్దుల్ రెహమాన్ కార్యకర్తలతో ఎద్దుల బండి తో నిరసన తెలిపారు. నూనెపల్లి రోడ్డుపై మొదలైన ఈ నిరసన కార్యక్రమం ప్రసాద్ ట్రేడింగ్ కంపెనీ పెట్రోల్ బంక్ వద్దకు సాగింది. అక్కడ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వినూత్న రీతిలో చేపట్టడం జరిగింది ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది అని తెలిపారు,  వారు మాట్లాడుతూ దేశంలో కరోణ విలయ తాండవం చేస్తుంటే బీజేపీ ప్రజలపై భారం మోపుతూ విలయతాండవం చేస్తున్నారని వీరికి ఏ రాజ్యాంగం కల్పించింది ప్రజల్ని పీడించి జలగల వారి రక్తాన్ని పన్నుల రూపంలో రోడ్ సేజ్ రూపంలో పన్నులు వసూలు చేస్తూ రైతు వెన్నుముక ను విరిచే విధంగా ఉన్నాయని తెలపడం జరిగింది. పెట్రోల్,  డీజిల్, వంట గ్యాస్ మరియు నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్న తీరు ఉందని మండిపడ్డారు. అలాగే బంకుల వద్ద సామాన్య ప్రజలకు మద్దతుగా,

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను, వంట గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలనుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత పాలనను ప్రజలకు తెలిసేలా వివరిస్తూ సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ  ఎద్దుల బండి  తో వినూత్నంగా నిరసన  నిర్వహించామన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ అవలంబిస్తున్న విధానాలను రాబోయే రోజుల్లో నంద్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఆడపడుచుకి క్లుప్తంగా ప్రతి గడపకు వెళ్లి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టౌన్ సీనియర్ నాయకులు యస్ యండి ఫరూక్, రియాజ్, అహ్మద్, రమ వెంకటేశ్వర్లు రాముడు యాకూబ్ ఆరిఫ్ తదితర కార్యకర్తలు మరియు అనుబంధ సంస్థలతో పాల్గొనడం జరిగింది.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: