రీ న్యూ పవర్ తర్లుపాడు వారి వితరణ
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం, తర్లుపాడు గ్రామము. తర్లుపాడు పి.హెచ్.సి. నందు డాక్టర్ కె. వంశీకృష్ణ మెడికల్ ఆఫిసర్ సమక్షంలో “ రీ న్యూ పవర్, తర్లుపాడు “ అనే స్వచ్ఛంద సంస్ధ అధికారులు ఎన్. తిరుమల్, ఎస్. సుబ్బారావు వైద్యశాల సిబ్బందికి కోవిడ్-19 నివారణ చర్యలో భాగంగా పిపిఇ కిట్స్, వైద్యశాలకు వచ్చు ప్రజల కోసం 5 మంచాలు, రెండు నెలల నుండి అంబులెన్ సేవలు అందించారు. మండలములోని ప్రజలు కోవిడ్-19 నుండి రక్షణ పొందుటకు పై సంస్ధ సహాయపడుతున్నది.
ఈ కార్యక్రమములో డాక్టర్ చైతన్య సుధ, డాక్టర్ ప్రతిభ(యునాని)ఎమ్.డి., సి.హెచ్.ఓ. టి. తులసి ప్రసాద్ రావు, హెల్త్ సూపర్ వైజర్ టి. సుధాకర్, ఎ.ఎన్.ఎమ్. బి.లక్ష్మిదేవి,ఫార్మసిస్ట్ ఎ.ఆదిత్య కుమార్ మరియు వైద్యశాల సిబ్బందితోపాటు చెన్నారెడ్డిపల్లి వైసిపి నాయకుడు శ్రీకాంత్ రెడ్డి పాల్గోన్నారు. రీ న్యూ పవర్ సంస్ధ, తర్లుపాడు ముఖ్య అడ్మిన్ ఎస్. సుబ్బారావుగారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు కోవిడ్-19 సహాయ చర్యలకు మద్దతుగా అవసరమైన సామాగ్రిని సంస్ధ అందించగలదని తెలియచేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: