బీసీ కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇవ్వండి
గత సాంప్రదాయాన్ని కొనసాగించండి
అనంతపురం బీసీ కార్పొరేషన్ ఈడీకి
బీసీ మహాజన సమితి. ఆంధ్ర బహుజన ప్రజావేదిక వినతి
(జానోజాగో వెబ్ న్యూస్-అనంతపురం ప్రతినిధి)
రాష్ట్రంలోని వివిధ బీసీ కులాలకు బీసీ కార్పోరేషన్ ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీసీ కార్పోరేషన్ అనంతపురం జిల్లా ఈడీ నాగముణికి బీసీ మహాజన సమితి. ఆంధ్ర బహుజన ప్రజావేదిక నాయకులు కె.ఆర్ హరిప్రసాద్ బహుజన్ కోరారు. ఈ మేరకు ఈడీకి ఆయన ఓ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకుడు కె.ఆర్ హరిప్రసాద్ బహుజన్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 63 మండలాలు గాను ఎక్కువ శాతం బీసీలు సేవా కులాలు వృత్తి సంచారజాతి కులాలు అయినటువంటి బ్యాక్ వార్డ్ కాస్ట్, కుల వృత్తిల మీద ఆధారపడి వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారు వీరికి ఈ కరోనా ఎఫెక్ట్ పడి కుల వృత్తులు జరగడం గఘనంగా ఉన్నది. రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో బీసీ సేవా కులాలు వృత్తి కులాల సంచారజాతి కులాలకు బీసీ కార్పొరేషన్ ద్వారా మున్సిపాలిటీ గ్రామపంచాయతీలో యూనిట్ల చొప్పున అర్హులైన ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ , బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు అయ్యేవి. నేడు దాదాపు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు అవ్వలేదు.
ఒకటిన్నర సంవత్సరం నుండి కరోనా రాష్ట్ర . దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో కుల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న చాకలి, మంగలి, వడ్డెర, కుమ్మర, బోయ తదితర సేవా కులాలు వృత్తి కులాల, వ్యక్తులు తమ కుటుంబం గడవడానికి కష్టంగా మారిన తరుణంలో చాలామంది ఈ కరోనా కాటుకు మరణిస్తే, కొంతమంది కుటుంబాలు జరగడం కష్టమని భారంగా మారి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కనుక బిసి కులాలు మనుగడ సాధించాలంటే వారివారి వృత్తులు మీద గతంలో ఏ విధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు అయేవో అలా అదేవిధంగా, బీసీ కార్పొరేషన్ బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తే బీసీలు కూడా బతకడానికి ఆస్కారం ఉంటాది కనుక గతంలో ఏ విధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు ఆ విధంగా విడుదల చేయాలి, ఇదే విషయాన్ని బీసీ కార్పొరేషన్ ఈడికి విన్నవించాము. వారి ద్వారా ప్రభుత్వ ఉన్నత అధికారులకు ప్రభుత్వ దృష్టికి మా సమస్యల్ని తీసుకువెళ్లి మాకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మహా జన సమితి జిల్లా విద్యార్థి సంఘం నాయకుడు బి సాయి కృష్ణ , పవన్ కుమార్ . రమణ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: