సీమ కోసం ప్రకాశంకు అన్యాయమా
కందుల నారాయణ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
రాయలసీమ కోసం వెనకబడిన ప్రకాశం జిల్లాకు అన్యాయం చేయడం సరికాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణం లొ స్థానిక సీపీఐ కార్యాలయంలో తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు .ఈ సందర్భంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన మార్కాపురం డివిజన్ ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన వెలిగొండ ప్రాజెక్టు ను గత రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి పురోగతి లేకుండా ఈ రాష్ట్రప్రభుత్వం మూలన పడవేసినా ఈ ప్రాంత వైసిపి నాయకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు అని తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ రాయలసీమకు నీటిని తరలించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్న ఈ జిల్లా మంత్రులు అధికార పార్టీ శాసనసభ్యులు గానీ ఎటువంటి చలనం లేకుండా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తెలిపారు. దీనిని నిరసిస్తూ సోమవారం అనగా 19.07.2021 వతేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మరియు కనిగిరి టిడిపి ఇన్చార్జ్ ఉగ్రనరసింహారెడ్డి గారు మరియు ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ ఎరిక్సన్ బాబు గారు పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య గారు మరియు సిపిఎం నాయకులు సోమయ్య గారు, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం గారు,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ గారు ఏం సి మాజీ చైర్మన్ శ్రీ కాకర్ల శ్రీనివాసులు గారు, పట్టణ తెలుగుదేశం నాయకులు కొప్పుల శ్రీనివాసులు గారు,తండ్రా వెంకటేశ్వర్లు గారు, జంకె రమణారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: