తాడివారి పల్లి గ్రామంలో..
మెడికల్ క్యాంప్
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పి హెచ్ సి నందలి తాడివారి పల్లి గ్రామంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. చైతన్య సుధా ఆధ్వర్యంలో ''మెడికల్ క్యాంప్ " నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 మందికి చిన్నచిన్న వ్యాధులకు చికిత్స చేయడమైనది. కోవిడ్ -19 టీకాను 5 మంది గర్భవతులకు,45 సంవత్సరాల పైబడిన 20 మందికి వేసినాము.12 మందికి వీ ఆర్ డి ఎల్ నమూనాలను ( కోవిడ్ -19 పరీక్ష కొరకు ) సేకరించినాం కోవిడ్ -19 అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించినాం.
కోవిడ్ -19 టీకాను వారి వారి వయస్సు ఆధారంగా తప్పక తీసుకోవాలని, కోవిడ్ 19 లక్షణాలు కనపడిన వెంటనే మరియు అనుమానికులు తప్పక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జె. జాన్ రత్నం, హెల్త్ సూపర్వైజర్ టి సుధాకర్, ఏం ఎల్ హెచ్ పి. రిబ్కా ఏఎన్ఎం. సిహెచ్. గాలేమ్మ, సిద్దిక్, ఏ డబ్ల్యూ డబ్ల్యూ. సందీప ఆశ కార్యకర్త పి కుమారి పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: