రెండేళ్ల నుంచి వెలిగొండ నిర్లక్ష్యం
కందుల నారాయణ రెడ్డి
ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వెలిగొండ ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు భారీ నిరసన ర్యాలీని నిర్వహించాయి. అనంతరం ఆర్ డి ఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు విచ్చేసి ఆర్ డి ఓ కార్యాలయం లో ప్రసంగించారు. తదుపరి మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, కనిగిరి మాజీ శాసనసభ్యులు ఉగ్ర నరసింహా రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి డైరెక్షన్ బాబు, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం పాల్గొన్నారు. అంతకు ముందు నిర్వహించిన ర్యాలీ లో మార్కాపురం పట్టణ టిడిపి అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణర, మార్కాపూర్ మండలం టిడిపి అధ్యక్షుడు జవ్వాజి రామానుజుల రెడ్డి, తర్లుపాడు టిడిపి అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, మార్కాపురం మునిసిపల్ టిడిపి కౌన్సిలర్స్ మార్కాపురం మండల, తర్లుపాడు మండలాల తెలుగుదేశం మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ
ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి వెలిగొండ ప్రాజెక్టు ను మూలన పడవేసి పశ్చిమ ప్రాంతం రైతుల పట్ల నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమ కు నీటిని తరలిస్తూ వెలిగొండ ప్రాజెక్టు మూలన పడవేయాలని చూస్తున్నారని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎనిమిది వందల అడుగుల నీటి మట్టం
శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాకూడా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ కు నీటిని తరలించవచ్చని కానీ వెలిగొండ ప్రాజెక్టు కు శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఎనిమిది వందల నలభై అడుగుల నీటిమట్టం ఉంటేనే నీటి తరలింపు సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసిన పశ్చిమ ప్రాంత రైతులను నిర్లక్ష్యం చేస్తూ రాయలసీమకు నీటిని తరలించ బోతున్నారని తెలిపారు. ఇవన్నీ తెలిసి కూడా ఈ జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గానీ మంత్రులు కానీ నోరు మెదపడం లేదని తెలియజేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంత తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో దీనిని ఒక మహా ఉద్యమంగా చేపట్టి రైతుల తరపున పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములో పట్టణ పరిసర ప్రాంత రైతులు, తెలుగుదేశం నాయకులు మరియు పురప్రజలు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: