అస్తి పన్ను.. చెత్త పన్నుల భారాలు రద్దు చేయాలి

ఏపీ పౌర సంఘాల సమాఖ్య  ఆధ్వర్యంలో...

మున్సిపల్ అఫీస్ వద్ద ధర్నా

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజలపై భారాలు మోపే అస్తి విలువ ఆధారంగా పన్ను, చెత్త సేకరణ పై పన్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ పౌర సంఘాల సమైక్య, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కాపురం మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాల మురళీ కృష్ణ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.కె.ఎం. రఫీ మాట్లాడుతూ చెత్త సేకరణ పేరుతో పన్నులు వేసేందుకు రంగం సిద్దం అయిందని చెత్త పన్ను నెలకి 60 రూపాయలు  వసూలు చేయాలని మున్సిపల్  కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. చెత్త సేకరణ పై పన్ను వసూలు చేయడానికి మున్సిపల్ సిబ్బంది సిద్ధమైందన్నారు. కరోనాతో ఉపాధికి దూరమై ప్రజలు కష్టాల్లో ఉన్న సమయాల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపడం అన్యాయమని అన్నారు. అస్తివిలువ ఆధారంగా ఇంటిపన్ను వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం

 


రాజ్యాంగ విరుద్ధం. ప్రజలు ఎన్నుకోబడిన కౌన్సిల్ లు వుండగా వాటి హక్కులు రద్దు చేయడమే అవుతుంది.  తక్షణమే జిఓ నెంబర్ 196197,198 రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు . మున్సిపల్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల పై ఎటువంటి భారాలు వేయబోమని ఎన్నికలు ముగిసిన అనంతరం పన్నుల భారం మోపడానికి సిద్ధమవటం మాట తప్పక మే అని అన్నారు. మున్సిపల్ అభివృద్ధి పనులకు ప్రజల నుండి వసూలు చేసి పనులు చేయాలనే ఆలోచన అన్యాయమని అన్నారు. యూజెస్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం చేయవలసిన ప్రతి పనికీ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి సోమయ్య, ఎం పి జె రాష్ట్ర కోశాధికారి ఎస్.కె అబ్దుల్ రజాక్, రసూల్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓద్దుల వీరారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కేశవరావు, డిజైన్స్ స్లేట్  వర్కర్స్ యూనియన్ నాయకులు పి. రూబెన్, పి బాల శేషయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, లోకేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఏనుగుల సురేష్, జెవివి నాయకులు వై రవికుమార్, సిఐటియు నాయకులు టీ గురునాథం, టి రాములు తదితరులు పాల్గొన్నారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: