ఆగస్టు 9 నిరసనలను...

జయప్రదం చేయండి

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

     కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక  చట్టాల రద్దుకై, సేవ్ ఇండియా అంటూ దేశవ్యాప్త  ఆందోళనలో భాగంగా ఆగస్టు 9న మండల, జిల్లా కేంద్రాల్లో  జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో హోం నందు సీఐటీయూ, రైతుసంఘం ,కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో  జిల్లా సదస్సు జరిగింది, ఈ ఈ సదస్సులో వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విదానాలు రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు మరియు పలు రకాల కార్మికులకు తీవ్ర నష్టం చేకూర్చేవిగా ఉన్నాయని విమర్శించారు. మోడీ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, నూతన విద్యుత్ బిల్లు దేశ ప్రజానీకానికి తీవ్ర నష్టం చేకూర్చేదిగా ఉందని విమర్శించారు. గత ఏడు నెలలుగా డిల్లీ లో రైతులు చేస్తున్న పోరాటానికి కనీసం స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరైన విధానం కాదని విమర్శించారు.

 
కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్ లను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ..పెరుగుతున్న పెట్రోల్ డీజల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసారు..కేంద్రం తన విధానాలను మార్చుకోక పోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ఆందోళనలో భాగంగా ఆగస్టు 9న న జిల్లా,మండల కేంద్రాలలో జరిగే నిరసన కార్యక్రమాలలో ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వ విధానాల నుండి భారతదేశ రైతాంగం కార్మిక వర్గాన్ని ఇతర ప్రజానీకాన్ని రక్షించుకునేందుకు  మండల జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ ఆగస్టు 9 నిరసన కార్యక్రమానికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళిక  ఈ ఉమ్మడి సదస్సులో రూపొందించామని తెలిపారు. విశాఖ ఉక్కుపరిశ్రమ  ప్రయివేటీకరణ ఆపాలని,పెట్రోలు, డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతుసంఘం జిల్లా కార్యదర్మి  గాలి వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెల్లంపల్లి ఆంజనేయులు వెంకటేశ్వర్లు,  సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.కె.ఎం. రఫీ, ఉపాధ్యక్షులు జి బాల నాగయ్య, పి. రూబెన్, ఏ. ఆవులయ్య, వెంకట్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి తిప్పారెడ్డి, ఏడుకొండలు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాఉపా అధ్యక్షులు , డి సోమయ్య, మాల్యాద్రి, ఏడుకొండలు, బడుగు వెంకటేశ్వర్లు, కాశయ్య ఎలీషా, బాలమ్మ,సిప్పోరా, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: