31లక్షల మందికి ఇంటి స్థలాల మంజూరు
మార్కాపురం ఆర్డీఓ ఎం శేషిరెడ్డి
ఆర్డీఓ ఎం శేషిరెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు 31లక్షల మందికి ఇంటి నివేశ స్థల పట్టాలు మంజూరు చేసినట్లు మార్కాపురం ఆర్డీఓ ఎం శేషిరెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన ఎర్రగొండపాలెం సమీపంలోని మిల్లంపల్లి టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన వైఎస్ ఆర్ జగనన్న కాలనిలో పలు పక్కా గృహాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం ఆర్డీఓ ఎం శేషిరెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం మంజూరు చేసిన నివేశ పట్టాల లబ్దిదారుల్లో 50 శాతం మందికి పక్కా గృహాలు మంజూరైనట్లు చెప్పారు. మంజూరైన పక్కా గృహాల లబ్ధిదారులు వాటిని నిర్మించుకునేందుకు జులై 1,2,3,4తేదీలలో భూమి పూజలు చేయాలని ప్రభుత్వం అదేశించిందని పేర్కొన్నారు. దానిలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజక వర్గంలో 2300 పక్కా గృహాలకు భూమి పూజ చేయాల్సి ఉందన్నారు. ఐతే వంద శాతం మంజూరైన పక్కా గృహాలకు భూమి పూజలు జరుగుతున్నాయన్నారు. మిల్లంపల్లి జగనన్న కాలనీలో ఎక్కువ మంది లబ్దిదారులకు స్థలాలు మంజూరైనట్లు చెప్పారు. అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ వేగవంతంగా భూమి పూజలు జరుగుతున్నట్లు చెప్పారు. త్వరలో ఆషాడ మాసం రాబోతుందన్నారు.
ఆ నెలలో కొత్త పనులు ప్రారంభించరు కాబట్టి ముందుగానే భూమి పూజలు చేపట్టాలని తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టార్గెట్ 2300 పక్కాగృహాలైనప్పటికీ 2500 పక్కా గృహాలకు భూమి పూజలు జరుగుతాయన్నారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని ఎర్రగొండపాలెం,మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో కలిపి 9300 పక్కా గృహాలకు భూమి పూజలు చేయాల్సి ఉండగా 100 శాతం భూమి పూజలు జరుగుతున్నట్లు చెప్పారు. పక్కా గృహాలు నిర్మించుకునే క్రమంలో లబ్దిదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా గృహనిర్మాణ శాఖకు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ను నియమించినట్లు తెలిపారు. అవసరమైతే ఆయన దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. లబ్ధిదారులు తమకు మంజూరైన పక్కా గృహాలను వేగవంతంగా నిర్మించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, ఎంపిడిఓ సాయికుమార్, తహసీల్దార్ వీరయ్య, హౌసింగ్ డీఈ శ్రీనివాస్, ఏఈ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: