పట్టుబడ్డ ఎర్రచందనం

ముగ్గురి అరెస్ట్


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామ  సమీపంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు నిరోధించే   క్రమంలో వాహనములను తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం తీసుకెళ్తుండగా అశోక్ లేలాండ్ వాహనంలో ఎర్రచందనం పట్టుబడింది. ముగ్గురు దుండగులను అరెస్టు చేసినట్లు ఎస్సై ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు. అందులోదుండగులు అర్ధవీడు మండలం లోని చిన్న కందుకూరు కి చెందిన గురక సురేంద్ర తండ్రి రామిరెడ్డి వయస్సు 30 సంవత్సరాలు మినీ లారీ డ్రైవర్, మరియు తట్టూరి శ్రీను తండ్రి సీయోను వయస్సు 28సంవత్సరాలు, తట్టూరి ప్రభాకర్ తండ్రి పోలయ్య వయస్సు 34 సంవత్సరాలు అని తర్లుపాడు ( టీవీ. పల్లి ) ఎస్ ఐ  ఆవుల. వెంకటేశ్వర్లు తెలిపారు. ఎర్రచందనం వాహనాన్ని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్ బాబు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ షేక్ అన్వర్ బాషాకు  అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రఫీ, కాశీనాథ్, హరూన్, విఆర్వో శ్రీనివాస్ రెడ్డి, వి ఆర్ ఐ.వెంకటరమణ పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: