'వెలిగొండ' ప్రాజెక్టు పునరావాసం ప్యాకేజిని మంజూరు

సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ ఏలూరి

ప్రాజెక్టు ప్రారంభమే శుభఘడియ దగ్గరపడింది

వైఎస్ కుటుంబానికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

'వెలిగొండ' ప్రాజెక్టు పునరావాస బాధితుల కోసం రూ.1,365.39 కోట్లను జననేత జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ నిర్ణయం ద్వారా ముంపు గ్రామాల్లోని 4,617 కుటుంబాలకు పరిహారంతోపాటు, పునరావాస ప్యాకేజీ అందనుందని ఆయన అన్నారు. పునరావాసం ప్యాకేజీని మంజూరు చేసిన ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఎన్నాళ్లుగానో వేచి చూసిన శుభఘడియ రాబోతుందని ఏలూరి అన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని విడుదల చేస్తున్నారు అంటే ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయిందన్న విషయం అర్ధం చేసుకోవాలన్నారు. తండ్రి చేపట్టిన మహాక్రతువుకు కొడుకు ముగింపు ఉత్సవం చేస్తుండటం సంతోషకరమైన విషయం అని.. మొత్తం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసిన వైఎస్ కుటుంబానికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం అని ఏలూరి అన్నారు. ఇదిలావెంటు వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తయి.. రెండో టన్నెల్ నిర్మాణం కూడా 80 శాతం కంప్లీట్ అయిందని ఏలూరి చెప్పారు.
ఈ 20 శాతం పనులు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జాగన్మోహన్ రెడ్డి.. త్వరలోనే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని జోశ్యం చెప్పారు. ఇదిలావుంటే శ్రీశైలం డ్యాం ఎగువున నల్లమల అడవిలో “కొల్లం వాగు” కృష్ణా నదిలో కలిసేచోట నుంచి 43.5 TMCల వరద నీటిని 200 మీటర్ల అప్రోచ్ కాలువతో పారించి అక్కడి నుంచి.. 18.8 కి.మీ పొడవున 2 సమాంతర సొరంగాల ద్వారా దోర్నాల కర్నూలు రహదారిలో ఉన్న “కొత్తూరు” వరకు నీటిని పారించి అక్కడ నుంచి సుమారు 22 కి.మీ పొడవైన కాలువ ద్వారా పారించి “నల్లమల సాగర్”లో నిలవ చేసి అక్కడి నుంచి వివిధ కాలువల ద్వారా ప్రకాశం, నెల్లూరు,కడప  ప్రాంతాలకు నీటిని తరలిస్తారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: