కరోనా కట్టడికి...
వాతావరణ సమతుల్యతా అవసరం
వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అద్యక్షులు ఐ.ఎం.అహమ్మద్
(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)
కరోనా కట్టడికి వాతావరణ సమతుల్యతా కూడా అవసరమని వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అద్యక్షులు ఐ.ఎం.అహమ్మద్ పేర్కొన్నారు. పర్యావారణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలోని వెల్పేర్ పార్టీ ఆప్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో ఐ.ఎం.అహమ్మద్ మాట్లాడారు. పర్యావరణ ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలని ఆయన అన్నారు. పర్యావరణ పెంపు దిశగా మొక్కలు నాటడం, పచ్చదనం కాపాడటం వంటి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
మానవాళికి పర్యావరణ సమతుల్యత ఎంతటి అవసరమో అందరికీ తెలుసు. అలాంటి పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ చేపట్టాలన్న నినాదంతో పర్యవారణ ప్రేమికుడు, న్యాయవాది ఐ.ఎం.అహమ్మద్ కృషి ప్రశంసనీయమని విశాఖ వాసుల మాట. పర్యావరణ పరిరక్షణ నిరంతరం సాధకుడు ఐ.ఎం.అహమ్మద్ కు మంచి పేరుంది. విశాఖ పోర్టు కాలుష్యం, వాహన కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ కోర్టులో పిల్ వేయడమే కాదు వాటి కోసం పోరాడి విశాఖ వాసుల్లో పర్యావరణ ప్రాముఖ్యత పెరిగేలా గత 20 ఏళ్లుగా పోరాడిన యోధుడు ఐ.ఎం.అహమ్మద్. వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆయన న్యాయవాది కూడా. కేవలం తన కెరీర్ కే ప్రాముఖ్యత ఇవ్వకుండా సమాజం పట్ల కూడా కొంత బాధ్యత కలిగివుండాలన్నది ఐ.ఎం.అహమ్మద్ అభిలాషా, తనను పలకరించే వారితో ఇదే విషయాన్ని సందర్భోచితగా ఆయన ప్రస్తావిస్తుంటారు కూడా. అందుకే ఆయనకు గ్లోబల్ ఇమ్ ప్యాక్ట్, విశాఖ రత్న, కళానిధి, మ్యాన్ ఆఫ్ ద ఇయర్, విశాఖ ఆణిముత్యం ఇలా అనేక అవార్డులు, బిరుదులు ఆయన సొంతమయ్యాయి.
కాలుష్య రహిత, స్వచ్చయుతమైన, విశాఖ కోసం ఆయన గత 2006లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో 30 నివారణోపాయాలను అసోసియేషన్ ఆఫ్ బ్రిటీష్ స్కాలర్ కు, ఆంధ్రా యూనివర్శటీ డిపార్ట్ మెంట్ ఆప్ ఎన్విరాన్ మెంటల్ సైన్స్ స్ వారికి నివేదిక రూపంలో సమర్పించారు. విశాఖలో వాహన కాలుష్యం...చిన్న పిల్లలకు ప్రాణ హాని అనే అంశంపై ఐం.ఎం.అహమ్మద్ నివేదిక నాటి రాష్ట్ర పతి కార్యాలయానికి, పర్యావరణ పరిరక్షణ శాఖకు పంపడం జరిగింది. కాలుష్యం పై ఐ.ఎం.అహమ్మద్ నివేదిక నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కు చేరడం, ఆ తరువాత విశాఖ కాలుష్యం, ఆహార కల్తీ, పండ్లు, కూరగాయలలో రసాయనాల వినియోగం వంటి వాటిపై ఐ.ఎం.అహమ్మద్ వేసిన ఫిల్ నెం 161 ఎఫ్ 2015 ఫలించింది. ఆ ఫిల్ రెండు తెలుగు రాష్ట్రాలలో చట్టాల మార్పునకు నాంది అయింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: