మా స్థలాన్ని కాపాడండి

పట్టదార్ పాస్ బుక్ మంజూరు చేయండి

ఎమ్మెల్యే, తహసీల్ధార్ కు తుమ్మల చెరువు గ్రామ ముస్లింల వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

తమ గ్రామ పరిధిలోని ముస్లింల మసీదు, శ్మాసనవాటిక, ఈద్ధా కోసం గతంలో కేటాయించిన భూమిని కొందరు స్వార్థ పరులు నకిలీ పత్రాలతో కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని కాపాడి ఆ భూమికి పట్టదార్ పాస్ పుస్తకాన్ని మంజూరుచేసి వాటిని కాపాడాలని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డికి, తర్లుపాడు మండల తహశీల్దార్ కు తుమ్మల చెరువు గ్రామ ముస్లింలు కోరారు. ఈ మేరకు వారివురికి ఓ వినతి పత్రం అందించారు. ఆ వినతి పత్రంలో వారు ఇలా పేర్కొన్నారు. తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామములో ముస్లీమ్ మైనారిటీలకు సంబంధించిన మసీదు, శ్మశానవాటిక, ఈద్గా కొరకు గతంలో మాజి ఎం.ఎల్.ఎ. ఉడుముల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యములో ఆనాటి ప్రభుత్వ అధికారుల సమక్షములో సర్వేనెంబరు 271/2 లోని మూడు ఎకరాల ఎనభైఅయిదు సెంట్ల భూమిని కేటాయించడం జరిగింది.

ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ స్ధలములో నిర్మించుకున్న మసీదులో ప్రార్ధనలతో పాటు రంజాను, బక్రీద్ పండుగల సందర్భంగా  ఆ స్ధలంలో పరిసరప్రాంత ముస్లీములందరూ కలసి సమూహ ప్రార్ధనలు జరుపుకొనేవారు. ఈ మధ్య కొందరూ నకిళీ పట్టాలు సృష్టించుకొని, కొందరి అండదండలతో మైనార్టీలకు కేటాయించిన ఈ భూమిని కబ్జా చేయాటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ముస్లింల ఆధీనంలో ఉంటున్న స్ధలాన్ని కాపాడి‌,అక్కడ నివాసంఉంటున్న మైనారిటీ ముస్లింల హక్కులను రక్షించాలని,శాశ్వత ప్రాతిపదికన పట్టదారి పాస్ బుక్,ఆన్లైన్ చేయించి ఇవ్వాలి. అని ఆ వినతి పత్రంలో తుమ్మల చెరువు గ్రామ ముస్లింలు కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: