రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించే వరకు పోరు

నిరసన కార్యక్రమంలో ఏఐకెయస్సీసీ నాయకుల పిలుపు 


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించి, రైతు సంఘాలు కోరిన విధంగా కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం చేసేవరకు ఐక్యంగా పోరాడతామని ఈరోజు( జూన్ 5న) బషీర్ బాగ్ లోని అయకార్ భవన్ ముందు జరిగిన నిరసన లో ఏ ఐ కె ఎస్ సి సి నాయకులు పిలుపునిచ్చారు. ఏ ఐ కె ఎస్ సి సి కన్వీనర్లు టీ సాగర్ ,పశ్య పద్మ, వేములపల్లి వెంకట్రామయ్య, విస్సా కిరణ్ తదితరులు మాట్లాడారు. వారు మాట్లాడుతూ ఈరోజు కు  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సంవత్సరం పూర్తయిందని చట్టాల ప్రతులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో దగ్ధం చేసి నిరసన తెలియజేశారని అన్నారు.  1974 లో జూన్ 5 న లోక్ నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ్ బీహార్ లోని పాట్నాలో జరిగిన భారీ ర్యాలీ నుండి సంపూర్ణ క్రాంతి ఆందోళన్ ను ప్రకటించారని


దానిని స్ఫూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ రైతు సంఘాలు జూన్ 5న సంపూర్ణ క్రాంతి దివస్ జరుపాలని నిర్ణయించినట్లు తెలిపారు.  కోవిడ్ లాక్డౌన్ సమయంలో మోడీ ప్రభుత్వం 3 నల్ల వ్యవసాయ చట్టాలను మొదట ఆర్డినెన్సుల రూపంలో  జూన్ 5, 2020న తీసుకు వచ్చిందని అప్పటి నుంచి నిరవధికంగా భారత రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా ఈ చట్టాలను రద్దు చేసేందుకు సిద్ధం కావడం లేదని అన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల అమలు వల్ల కార్పొరేట్ సంస్థలు లాభం పడతాయని అన్నారు. కార్పొరేట్ శక్తులు పర్యావరణాన్ని ధ్వంసం చేసి సమాజానికి హాని కలిగిస్తాయని అన్నారు. కరోనా తీవ్రంగా కొనసాగుతున్నప్పటికీ లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం  తక్షణం రైతు సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యమంలో 500 మంది రైతులు తన ప్రాణాలను బలిదానం చేశారని అన్నారు.

ఈ చట్టాలని తక్షణం వెనక్కి తీసుకోవాలని లేనియెడల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉదృతంగా నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న రైతు సంఘాలు ప్రజా సంఘాలు ,ప్రజలు అందరికీ ఏఐకెయస్సీసీ రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి,సిఐటియు రాష్ట్ర కార్యదర్శి యస్ రమ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి ప్రసాద్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సి ఐ టి యు రాష్ట్ర నాయకులు శ్రీకాంత్,జెవిచలపతి రావు,కాంతయ్య, కిషోర్,అరుణ,పద్మ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: