జగన్నాధపురం పంచాయతీ ఎస్సీ కాలనీలో...

నిర్మాణ పనులు ప్రారంభం

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని జగన్నాధపురం పంచాయతీ ఎస్సీ కాలనీలో గ్రామ సర్పంచ్ గంట వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డు, సైడు కాలువలు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అభివృద్ధి అధికారి ఎస్ నరసింహులు గారు, పంచాయతీరాజ్ ఏఈ ఏ శ్రీనివాసరెడ్డి పాల్గొని కొబ్బరికాయ కొట్టి నూతన సిమెంట్ రోడ్డు, సైడ్ కాలవలు  నిర్మాణ పనులను ప్రారంభించారు.

 


ఈ సందర్భంగా ఎంపీడీవో ఎస్ నరసింహులుమాట్లాడుతూ మండలంలో  16 పంచాయతీల గాను జగన్నాధపురం గ్రామపంచాయతీ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ నిధులతో గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతన సిమెంట్ రోడ్డు, సైడ్ కాలవలు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ తేజస్విని, వి ఆర్ ఓ వెంకట్ రమణారెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైదులు  తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: