కేసీఆర్ వి కూడా అనాలోచిత నిర్ణయాలే

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కరోనా కట్టడిలో మోడి ప్రభుత్వానివి అనాలోచిత నిర్ణయాలైతే , వైరస్ ను తేలికగా తీసుకుంటూ కెసిఆర్ అసెంబ్లీలో, బయటా చేసిన వ్యాఖ్యలు అనాలోచితము కావా..? మంత్రి కె.టి.ఆర్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎప్పుడో పూర్తి కావాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ మోడి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణాన మందకొడిగా సాగుతుందని మంత్రి కె.టి.ఆర్ నిన్న విమర్శించారు. అనేక ప్రపంచ స్తాయి ఐ.టి సంస్థలను తన కృషి తో తెలంగాణా కు రప్పించానని ప్రచారము చేసుకునే కెటిర్, వ్యాక్సిన్ కోసము పిలిచిన గ్లోబల్ బిడ్లలో ఒకరిని కూడా ఆకర్షించలేక ఎందుకు ఘోరంగా విఫలమయ్యారు? అటు దేశ వ్యాప్తంగా ఇటు తెలంగాణాలో ప్రజలను దిక్కుతోచని పరిస్తితి లోనికి నెట్టి వేయడానికి అటు మోడి ఇటు కెసిఆర్ ఇద్దరూ కారణమని ప్రజలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. భాధ్యతను ఒక్కరి మీద ఒక్కరు నెట్టేయడము మాని తమ ద్వారా జరిగిన లోపాలను అంగీకరించి, చిత్తశుద్దితో ఈ గండము నుండి బయటపడేసే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అని జి.నిరంజన్ పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: