ఏసీబీ అదుపులో ఏ.ఎస్ఐ పోల్ రాజు 

తాడివారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు పంచాయితీ పరిధి లోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు పొలములో గేదెలు వచ్చి పంటను పాడు చేశాయని ఇరువురు ఘర్షణ పడి తాడివారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయకుండా ఏ.ఎస్ఐ పోల్ రాజు ఇరువురి వద్ద 30 వేల రూపాయలు డిమాండ్ చేయడంతో వారిలో ఒకరు ఏసీబీ ని ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ఏసీబీ  డి.ఎస్.పి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాడివారిపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏ.ఎస్ఐ పోల్ రాజు ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా ఏసీబీ  డి.ఎస్.పి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బాధితుల నుండి 30 వేల రూపాయలు ఏ.ఎస్సై పోల్ రాజు కేసు లేకుండా చేస్తానని డిమాండ్ చేయగా వారు అంత ఇచ్చుకోలేనని 20 వేల రూపాయలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని అందులో భాగంగా పదివేల రూపాయలు ముందుగా ఇచ్చారన్నారు. మిగతా 10,000 రూపాయాల కోసం బాధితులను ఇబ్బంది పెడుతున్నారని వారు అంత డబ్బు ఇవ్వలేక వారి వద్ద ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో ఏసీబీ కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. దీంతో ముగ్గురు ఏసీబీ  సీఐలు మరియు పదిమంది ఏసీబీ సిబ్బందితో తాడివారిపల్లి పోలీస్ స్టేషన్ లో తనిఖీలు  నిర్వహించామన్నారు. ఈ తనిఖీలో ఏ.ఎస్ఐ పోల్ రాజు ను ప్రధాన నిందితులుగా గుర్తించామని ఇంకా ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ చేపడతామని అన్నారు. అనంతరం ఏఎస్ఐ పోల్ రాజు పై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ జిల్లా కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సిఐలు రాఘవరావు, వెంకటేశ్వర్లు, అపర్ణ, కానిస్టేబుల్ కృష్ణ, ఏసిబి సిబ్బందితో పాటు ఈ కార్యక్రమములో దర్శి డి.ఎస్.పి. ప్రకాశరావు, పొదిలి సిఐ సుధాకర్ రావు, పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: